102
తిక్కన సోమయాజి
కు విశేషించి చెప్పవలసినది లేదు. సోమయాజియు నట్టియుపాసనాబలంబున విజ్ఞానసంపన్నుఁడై భారతరహస్యార్థములఁ దెలిసికొని వేదముం బ్రకటించిన చతురాననప్రతిష్ఠ నంది యుండె నని చెప్పుటకు సందియము లేదు. ** * * * సోమయాజికి వేదాంతాది శాస్త్రములందును, సాంఖ్యయోగాది శాస్త్రములలోపలను గలవిశేషపాండిత్యము శాంత్యానుశాసనిక పర్వములను తక్కినపర్వములలోఁ దత్త్వముం జెప్పెడు నితిహాసాదులవలనం గోచరంబులుగాఁ గలవు. పూర్వోత్తరమీమాంసశాస్త్రము లెంతయు నేర్చినవాఁ డని సోమయాజి జైనపండితులతోఁ జేసిన సంవాదాదికము వలనం గోచరంబగును. అట్టివాని వివరములు గ్రంథస్థములు గాకున్నను. అట్టిసంవాదములు విషయముమాత్రము సోమదేవరాజీయము మొదలగు గ్రంథములలో గొంత వివరింపఁ బడియున్నదానినే నీవఱకే ప్రకటించితిని.”
అనివ్రాసి యుండెను. ఇన్నిశాస్త్రములు చదువుకొని యిన్ని సాంప్రదాయములు దెలిసియుండి యింతవిజ్ఞానసంపన్నుడైనవేదవేత్త యాకాలమున వైదికమార్గనిష్ఠమగు పర్తనము గలిగి యుండెననుట యవిశ్వాసపాత్రము గాదు. వేదాంతతత్త్వరహస్యంబులు, చిదచిద్వివేకంబుల ధర్మాధర్మంబులు, రాజనీతిప్రకారంబులు, భారతవీరుల ప్రభావంబులు మొదలుగాఁగల భారతార్థముల నాంధ్రావలి మోదముం బొరయు నట్లుగాఁ దెలిపి యాంధ్రప్రపంచము సుద్దరించుటయే తిక్కనసోమయాజి మనోసంకల్పమై యుండెను. అందుకొఱకే యామహానుభావుఁడు మహాకవిత్వ దీక్షావిధిని బూని సాత్యవతేయుని సంస్మరించి 'యీదృశంబు లగు పుణ్యప్రబంధములు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్కయారాధనవిశేషంబుగాఁ దలంచి'