పుట:Tikkana-Somayaji.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

తిక్కన సోమయాజి


తిక్కనసోమయాజి కాలమున నెల్లూరున హరిహరాలయము గల దనియు నాతనిపేరిటనే తిక్కనసోమయాజి తనభారతము నంకితము గావించె నని చెప్పెదరుగాని యది యథార్థము గాదు. తిక్కనసోమయాజికాలమున హరిహరనాథుని యాలయము నెల్లూరున లేదని చెప్ప వచ్చును. తిక్కనసోమయాజిచే భారతమున స్మరింపఁ బడిన హరిహరనాథుఁడు హరి హరులకు భేదము పాటింపని యద్వైతుల కుపాస్యుఁడును హరిహరుల కధినాథుఁడు నగుసర్వేశ్వరుఁడని విరాటపర్వము లోనియవతారికనుగాని యాశ్వాసాద్యంత పద్యములను గాని విమర్శించి చూచినపక్షమున బోధపడఁగలదు. నన్నయభట్టారకుఁడును తిక్కనసోమయాజియును నేకకాలమునం దున్నవారని కథలు కొన్ని కవిజీవితములందును, కవులచరిత్రమునందును నుదాహరింపఁబడుటయేగాక కవిజీవితములం దావాదమే సిద్ధాంతముచేయఁ బడియున్నది. కాని నూతనపరిశోధనములవలన నాయిరువురును సమకాలికులుగా రనియు నిరువుర కిన్నూరు సంవత్సరములు కాలభేదము గలదనియు స్పష్టపడినది. కావున నాకథ లన్నియు నవిశ్వాసపాత్రములై వ్యర్థములై పోయినవి. నన్నయ పదునొకండవశతాబ్దిమధ్యమునను, తిక్కన పదుమూఁడవ శతాబ్దిమధ్యమున నుండిరి.

ఈ మహాభారతమును రచించునపుడు తిక్కనసోమయాజి చేసిననియమము మఱియొక్కటి గానవచ్చుచున్నది. ఏదియన,