పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాలో ఇంతకాలం అణచి పెట్టబడిన అతి పురుషత్వ వాంఛలు ఉప్పొంగిపోయినాయి.


                                                                                                           *        *        *
   రాత్రి  ఎనిమిదిగంటలు  కొట్టుతుండగా  ఇద్దరమూ  మామూలు మానవత్వానికి  వచ్చాము. సుశీల  మోము  అత్యంతానందంతో  చిరుగాలులు  వీస్తూ ఉండగా కలకలలాడే  వెన్నెల రేయిలో  కలువపూవులా ఉంది. నేను మనో నీరసత్వంతో అక్కడనుంచి  లేచివెళ్ళి  పక్కమేడ  డాబామీద ఆట లాడుకొంటున్న బాలికలను చూస్తున్నాను.
   ఇది మహాదోషమా?  దోషరహితమా?  పుణ్యమా, పాపమా? శకుంతలా స్మృతి ఒక్కసారిగా ఎగిరివచ్చి నామీద వాలింది. ఆమె పేరు ఉచ్ఛరించడానికి  అర్హత  తీసివేసుకున్న  ద్రోహం చేశాను  నేను. హీనుడను, హీనుడను, హీనుడనయ్యా!  చెవిలో గింగుర్లు పెట్టినవి.
   పుణ్యమేమిటి, పాపమేమిటి? అన్న భావం  వచ్చింది. ఎంత నీరసుణ్ణి. నాకు నేనే శత్రువునా? విరోధినా? ప్రబలహంతకుణ్ణా?  సుశీల ఎరుపెక్కిన  బంగారు కమలంలా నా దగ్గిరకు  వచ్చి  డాబా  పిట్టగోడ   నానుకున్న నాపక్క  నిలబడింది.
                                         

నువ్వే నా భర్తవు మూర్తీ? ఇక నిన్ను వదలలేను. నేనేమి మాట్లాడగలను?

    మూర్తీ! ఈ రోజు  నేను  తల్లినయ్యే  సన్నాహంలోనూ ఉన్నాను. నీకు భార్యనయ్యే మధుర  సంసిద్దతలోనూ  ఉన్నాను. నేను సర్వదేవతలను దేవీమూర్తులను  ప్రార్ధించా! నువ్వు ఈ  వాళ  నా భర్త కావాలని, నేను  గవ్వ లక్కకు మొక్కుకున్నా కూడా! నా కోర్కె ఫలించింది. నువ్వు నాకు  బంగారు  పాపాయిని యిస్తావు.
   నా గుండె  గుభేలుమని  ఆగిపోయింది. నేను  యెంత  పని చేశాను! ఈమెకు  ఈ దొంగరకమైన భర్తనయ్యాను. నా శకుంతలను  రెండవసారి  చంపుకున్నాను. సుశీల తన తుచ్ఛవాంఛను (కాదేమో) తీర్చుకోవడానికి  దేవతల్ని  ప్రార్ధించి నెగ్గింది. నా దేవిని నేను బ్రతికించుకోలేకపోయాను. నా ఒళ్ళు గజగజ  వణికింది. సుశీల  నామీద చెయ్యివేసి,  అమ్మో! నీ  వళ్ళు  ఈలా  కాలిపోతుందేమిటి! రా లోపలి  రాఅని  నా  చేయిపట్టి, నా చుట్టు  చేయి వేసి నన్ను తనకు గాఢముగా  అదుముకొని క్రిందకు తీసుకువెళ్ళింది.
   ఎల్లా వెళ్ళానో! నాకేమీ తెలియదు. మెదడు వేడెక్కింది. ఒళ్ళు తిరుగుతోంది. కళ్ళు  మూతపడిపోయినాయి. ఆమె  నాకు  కాశ్మీర శాలువలు కప్పింది. మెత్తటి ఉన్ని పచ్చడము కప్పింది. శీతాకాలములో వాడుకొనే  రగ్గు కప్పింది. నా ఒణుకు  తగ్గలేదు.
   నాకు   107 డిగ్రీల  జ్వరం వచ్చిందట. మా అమ్మకు  కబురు వెళ్లిందట. మా అమ్మ  దాక్టరుకోసం గంగాధరుణ్ణి కబురు పంపిందట.  ఆయన కారుమీద  ఆ ఇంటికివచ్చి  నాకు  మెదడుమలేరియా  అని నిశ్చయించేశాడట. ఆ ఇంట్లో