పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చావు బ్రతుకుల మధ్య ఇరవై రోజులున్నానట. మా అమ్మ మా మేనమామకు టెలిగ్రాం ఇచ్చిందట.

   మా మేనమామ  పరుగెత్తుకొని  కాశీ  వచ్చాడట. ఆ ఊళ్ళో  ఉన్న ఇద్దరి పెద్దడాక్టర్లను, అలహాబాదులో వున్న పెద్దడాక్టర్ని  పిలిపించారట. మా మేనమామ  నా కోసం  ఆ రోజుల్లో వేలు  ఖర్చు చేశాడట. వైద్యమే నన్నారోజుల్లో  బ్రతికించింది. ఆయుర్వేదం నన్ను మనుష్యుణ్ణి చేసింది. సుశీల ఆ రోజుల్లో తిన్నగా తిండి తినలేదట. మా అమ్మతోపాటే  నాకు సపర్య చేస్తూ  ఉండేదట. నాకు జ్వరం  నెమ్మదించడం  సుశీల  పిచ్చిదానిలా  చేసిన, ఒక పిచ్చిపని  వల్లనేనట.
                                                                                                             24
   సుశీల ఇంటిలో  నేనలా జ్వరంవచ్చి   పడి   ఉండడంవల్ల, సుశీలకు మతి పూర్తిగాపోయి, గవ్వలక్కకు మొక్కుకొని, అన్నపూర్నకూ, డుంఠి వినాయకునకూ అనేక పూజలు  చేయించింది, ఏడ్చింది, దొర్లింది.
   ఒకరోజు  రహస్యంగా  ఒక హిమాలయ  వాసి  సన్యాసి ఒకాయన దగ్గరకు  పోయిందట. ఆయన  మన్ను నలపిస్తే  అదేమందన్న ప్రతీతి  ఆ  మహానగరమంతా వ్యాపించి  వుంది. ఆయనకు సుశీల తనింటికి వచ్చిన  ఓ  తీర్థవాసికి  చాలా జబ్బుగా ఉందనీ,  అతడొక్కడే  బిడ్డననీ, తల్లీ కొడుకూ కలిసి వచ్చారనీ, ఆ  బాలకుణ్ని  రక్షిస్తే  వాళ్లదారిని వాళ్ళు పోతారని  చెప్పిందట. పైటకొంగున  ముడిగట్టిన  పాతిక రూపాయలా సన్యాసి  చేతిలో పెట్టిందట.
   ఆ  సన్యాసి  తన సంచిలోనుండి  ఒక  మందు  తీసి, అది  కొంచెం  మాత్రచేసి తనవంటి  బూడిదతీసి  పూసి,  ఇది యియ్యి  బ్రతుకుతాడు.  ఈ  రాత్రి  ఇంకో పాతిక రూపాయలు   పట్టుకురా అన్నాడట. ఆ  మాత్ర  ఎవ్వరూ చూడకూండా  నాచేత  మింగించిందట. నాకు  స్పృహేలేదట. ఆ  సన్యాసికి  పాతిక రూపాయలు  పంపించిందట. ఇది రాత్రి జరిగిన పని. ఆ  తెల్లవారగట్ల, నాకా జ్వర  తీవ్రతతో  కడివెడు  విరేచనమై, కాళ్ళు చేతులు చల్లబడి వాతం కమ్మింది. ఇంగ్లీషు వైద్యులు  వచ్చి  గ్లూకోజు మొదలైన  వేమేమో ఇంజక్షను లిచ్చారట. లాభంలేదని  చక్కా బోయారట. అప్పుడు  జగత్ రాం పండాను  సుశీల పోరుపెట్టి, కవిరాజ్  వైద్యరాజు  పండిత బోలానాథ్ ను  రప్పించిందట. మా  అమ్మ నేను  చచ్చిపోయాననే మూర్ఛపోయింది. మా  మామయ్య మాత్రం  విపరీత  ధైర్యంతో మా అమ్మకు  ఉపచారం చేయిస్తున్నాడు. నేను బ్రతుకుతానన్న ఆశ అతనికీ పోయిందట.
   బోలానాథ్ వచ్చి  నాచేయి  నాడిచూచి, అయ్యో మనిషిని  అక్రమంగా  చంపారని  వాతరాష్ట్రం, వాతగజకేసరి, వాతజ్వరాంకుశం, సూతికాభరణం, సన్నిపాతం, కస్తూరి, మహాపాశుపతం,  గరళం, నవరత్న చింతామణి, అన్నీ కలిపి  నూరి, బొడ్డుకు పట్టు, మాడుపై చిన్న గాయం చేసి  అందుపై పట్టు, గుండెలకు పట్టు