పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేను: అవి శాస్త్ర రీతిగా ఉన్నాయని ఎల్లా చెప్పగలవు రామకృష్ణా?

   రామ: మనకు ఆలోచనా శక్తి ఒక రీతిగా వుంటుందా?
   నేను: అందరి ఆలోచనా శక్తి ఒక రీతిగా వుంటుందా?
   విశ్వమూర్తి : (ఇంకో స్నేహితుడు) అందరికీ సమానమైన  రాజకీయాధికారం, సమమైన  అర్థస్వామ్యం, ఉత్తరోత్తరా  ప్రపంచ రాజకీయాందోళన  సమసిపోతుంది గదా?

నేను : ఓయి వెఱ్ఱబ్బాయి! అంతటితో మన సమస్య పూర్తవుతుందా? ఒకడు ఎక్కువ అధికారాలు వాంఛిస్తాడు. ఒక సంఘం ఎక్కువ భాగం ఆశిస్తుంది. ఒకదేశం ఎక్కువు లాభం కోరుతుంది. అప్పు డీ సమానత్వం ఏమౌతుంది?

   రామ : ఏమోయి మూర్తీ! నీ వాదం వితండంగా ఉంది. మనం ఇల్లు కట్టించుకుంటున్నాము. పెద్ద భూకంపం వచ్చి ఇల్లు పడిపోతుందనుకో అన్నట్టుగా మాట్టాడుతున్నావు.
   విశ్వ : మనుష్యుల్లోని  నీరసత్వాలవల్లా, అన్యాయ  కాంక్షలవల్లా ఇప్పటి భయంకర స్థితి  ప్రపంచానికి  దాపురించింది. అవన్నీ  పరీక్షచేసి మానవ నైజం  సంపూర్ణంగా  గ్రహించి  కారల్ మార్క్సు తన 'డెస్ కాపిటల్' రచించాడు.
   నేను : అవునయ్యా! సరిగా 'డెస్ కాపిటల్' గ్రంథంలో వున్నట్లు రష్యా సోవియట్ రాజ్యం స్థాపన అయిందంటావా విశ్వం?
   విశ్వ :  ఏ  ఉత్తమ  విషయమైనా  ఆచరణలో పెట్టేటప్పటికి  కొన్ని తాత్కాలికాలూ, స్థానికాలూ, అయిన  మార్పులు  వస్తూనే  ఉంటాయి. గాంధీగారి  తత్త్వం  ప్రకారం కాంగ్రెసు  నడవ కలుగుతోందా మూర్తీ?
   నేను : అందుకనే నేను  చెప్పేది, ఆచరణ వేరు, ఆశయాలు వేరుగా ఉంటాయని, కనుక  ఏనాటికైనా  కారల్ మార్క్సు ఆశయాలు వృధా అవుతాయి.
   ఇలా  మా  ముగ్గురికీ  వాదనలు ప్రబలాయి. నా మనస్సులో ఉన్న ఆశయాలన్నీ నా శకుంతలతోనే  వెళ్ళిపోయాయి. నాకు  బోల్షివిజం అయినా ఒకటే, గాంధీయిజం అయినా ఒకటే. ప్రపంచంలో కొట్టుకు తినడానికి మనుష్యుడూ, జంతువులూ ఉద్భవించారు. ఎవరి వస్తువులు వారు  కాపాడుకొంటూ  వుంటారు. కొట్టుకు తినడానికీ, కాపాడుకోవడానికీ ఎప్పుడూ యుద్ధం. అందుకనే వెనుకటి  ప్రపంచ యుద్ధం వచ్చింది. అనే నమ్మకం స్థిరపడి పోయింది.
   నా  స్నేహితులు  నాకు చదువుకోమని అనేక గ్రంథాలు యిచ్చారు. రహస్యంగా రాష్యానంచి అనేక కరపత్రాలు వస్తూవుండేవి.కూలీలను రైతుకూలీలను, బీదరైతుల్నీ లేవదీయడం, కోటీశ్వరులను  జమీందారులను కూల్చివేయడం, ప్రజా విప్లవం తెచ్చి  సోవియట్  ప్రభుత్వం స్థాపించడం, ఇవి  ఆ కరపత్రాలలో ఉండే ముఖ్యవిషయాలు. ఒకసారి అన్ని దేశాలలో స్వామ్య రాజ్యాలు స్థాపన కావాలి  అని భావించాను.ఒకసారి ఏ రాజ్యంలేకుండా దేశాలన్నీ నాశనం కావాలనుకున్నాను. కాని అన్నింటికీ  వెనకాల  చిన్ననాటి