పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకరాత్రి సుశీలాదేవి తమి పట్టేకపోయింది. నామీద వాలిపోయింది. నా మొగమంతా ముద్దులు కురిపించింది. బంగారు తీగలాంటి తన శరీరం నా శరానికి అతిగాఢంగా, గాఢంగా అదిమివేసి అలుముకుపొయింది. నాలోని కాంక్షలు వక్కసారిగా విజృంభించినాయి.

    మూర్తీ! మూర్తీ! నాకోర్కె తీర్చు. నీకోసం బ్రతుకుతున్నా! అన్నది ఆమె. నాకు వళ్ళు  తెలియలేదు. ఇంతలో  మెలకువ  వచ్చింది! ఏది నాకు మెలకువ  తెచ్చిందో  తెలియదు. అంతే!
   నాకు బొటబొట కళ్ళనీళ్ళు కారిపోయినవి. మంచంనుండి. జీవచ్చవంలా  లేచాను. నా చొక్కా తొడుక్కొన్నాను. సుశీలాదేవి లేచి జాకెట్టు తొడుక్కొని  చీర కట్టుకుంది.
     మూర్తీ!  కోర్కెతీర్చకుండా వెళ్ళిపోతావా?  నేనేం చేశాను? నేను స్వచ్ఛమైన దానిని కాననా నీ ఉద్దేశం? అవును; మాబోటి  నిర్భాగ్య  జీవితాలలో నిర్మలత్వం  ఎక్కడ వస్తుంది!
    సుశీలా! నీతో సహవాసం చేసి, నీమతి విరిచిన  తప్పునాది. అంతే! నేను ఇప్పుడు స్త్రీ  పురుషధర్మం నిర్వహించకుండా వెళ్ళిపోవడానికి  నువ్వు కారణం కాదు. నేనే కారణం. నాలో భయం  దాగి వుంది. పూర్వవాసనల నీరసత్వం  నన్ను కుంగదీస్తున్నది.
    నువ్వు  నా స్నేహం చేసినప్పటినుంచీ ప్రేమనేది  ఏమిటో తెలుసుకున్నా, ప్రేమకు ఫలం యివ్వవా నాకు?  నేను ప్రేమించగలిగినవాడు దొరికితే  చక్కని కొడుకుని, అందంమైన బాలికను కందామని  యెదురు చూస్తున్నా, ఈరోజు  నాప్రేమ తృప్తి, నా ప్రేమ ఫలం వాంఛించి సిద్దమయ్యాను. మూర్తీ! నువ్వలా  వెళ్ళిపోతావా?  నా  జన్మలో ఇక రాజపుత్ర సానపు ఎడారులేనా?
    సుశీలా, నన్ను  ఆలోచించుకోనీ, నీకు భర్త  వునాడు! యిద్దరు విద్యార్ధి స్నేహితులున్నారు....
    నోరుముయ్ మూర్తీ! నీ నిర్ధయవల్ల  నన్ను  చంపేయడమే కాకుండా, నన్ను దెప్పుతున్నావా? మీ మగవాళ్ళంత  తుచ్ఛులు ఎక్కడన్నా ఉన్నారా?  పట్టుకుపో నీ డబ్బూ, నీ విచ్చిన బట్టలూ.  ఆడడానికి అభిమానం  లేదనుకున్నావా?
    సుశీలా! నా చరిత్రంతా నీకు చెప్పలేదు.  రేపు సాయంకాలం  వచ్చి, నా జీవితం యావత్తూ నీకు నివేదిస్తా. నువ్వే నాకు  న్యాయాదిపతివి   అవు! ఇంతకన్న  ప్రస్తుతం మాట్లాడలేను.
   అని విసవిస వాళ్ళింటిలోనుంచి వచ్చేశాను. ఆ గల్లీలలో తిరిగి తిరిగి ఇంటికి చేరుకొన్నాను. అప్పటికి పదిగంట  లవుతుంది. రోజూ పదకొండు గంటలలోపుగానే  ఇంటికి చేరుకొనేవాణ్ణి. ఏవో రెండు మెతుకులు  నోట్లో వేసుకొని  పడకగదిలోకిపోయి, మంచంమీద కూలిపోయాను. పాపం సుశీల  కామవాంఛతీర్చలేకపోయాను. నా పిరికితనానికి  నన్నే తిట్టుకున్నాను. ఎందుకు వచ్చిందో  ఈ  పిరికితనం? ఎందుకామె వాంఛ తీర్చకూడదు? దేవు