పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ళ్ళకే ఎదురు తిరిగిన నేను పుణ్యపాపాలూ, నైతిక ధర్మాలు గణించడం ఏమిటో? నాకా భావాలు నా శకుంతలతోనే వెళ్ళిపోయాయి. కాని పిరికితనం పోలేదు. పిరికితనం యుద్దంలో పరాజయం తెస్తుంది. దేవుళ్ళతో యుద్దం చేయడంలో పిరికితనం తిరిగి ఎదురువచ్చిన నారాయణాస్త్రం వంటింది.

   దేవుళ్ళతో యుద్ధం  మన హృదయరంగంలో పూర్వ నమ్మకానికీ  అందుకు వ్యతిరేకం  అయిన విప్లవభావాలకూ యుద్థమేకదా! నా  ముందు వేలకొలది పూర్వీకుల  నమ్మకాల కోటలు బురుజులతో ఆకాశం  అంటే  అతి మందపు  గోడలతోటున్నాయి.  నాకు బలం నాబోటివాళ్ళే, పాశ్చ్యాత్యులలో కొందరూ, అంతే! 


   ఆ  గోడలు  నాకు సుశీల  గదిలో కనుపించాయి. నా దగ్గర యంత్రాయుధాలు తక్కువగా ఉన్నాయి. సుశీల  అందం బలం యివ్వలేదు. ఆ గోడల మీద  నా శకుంతలను భావించుకొన్నాను కాబోలు.
   తెల్లవార్లూ  నిద్రపోలేదు. పక్కమీద దొర్లుతూ ఉన్నాను. తల వేడెక్కి ఉంది. ఉడుకెత్తిన  నా రక్తం  చల్లారలేదు. సుశీల  వాక్యాలు నా గుండెను అదరించివేసాయి. లేచి రెండు మూడుసార్లు వీధి తలుపు దగ్గరకు వెళ్లాను, సుశీల దగ్గరకు వెడదామనే! మళ్ళీ సిగ్గుపడి వెనక్కు చక్కా  వచ్చాను.
                                                                                                                21
   సుశీలాదేవి ఇంటికి వెళ్ళడమే మానివేశాను. మానివేసిన మూడురోజుల్లో సుశీల భర్త  మా యింటికి వచ్చాడు. అతణ్ణి చూడగానే నేను సిగ్గుచేత    నేలలోనికి కుంగిపోయాను. ఏ తగాదా వస్తుందో  అని భయపడిపోయాను.
   సుశీల భర్త పేరు జగత్ రాం పండా. జగత్ రాం పండాకు  సుశీల రెండవ భార్య.  భార్య కోరిన  కోర్కెనెరవేర్చడం అతని తపస్సు. ఆమె సంతోషంగా ఉంటే విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైనట్లే అతడు  సంతోషించేవాడు.
    పండిట్ జీ! నా భార్య భయంకరమైన జ్వరంతో పడిపోయింది.జ్వరం సంధితో ప్రారంభించింది. సర్వకాలం నీపేరే  గొణుక్కుంటుంది.  వచ్చాడా శ్రీనాథమూర్తి?  అనే  ప్రశ్న బాబూజీ! నువ్వు  వెంటనే ఒక్క సారి  మా యింటికి  రావాలి. నా సుశీల  నన్ను విడిచి  వెళ్ళిపోతే ఒక్క నిమిషం  బ్రతకలేను. నువ్వు వెంటనే రావాలి. నన్నూ, నా భార్యనూ బ్రతికించు, నా బగ్గీమీద  పోదాం రా బాబూజీ!
   ఆ మాటలు  వింటోంటే నా ప్రాణాలే  పోయాయి. నా శకుంతలతో  పాటు  దేశంలో ఉన్న ఆడవాళ్లందర్నీ చంపడానికే పుట్టానా అని వణికిపోయాను. వెంటనే బయలుదేరాను  జగత్ రాం పండా ఇంటికి. ఇల్లంతా చుట్టాలతో కిటకిటలాడుతూ ఉంది. ఆపట్నంలో  ప్రసిద్దికెక్కిన  ఆయుర్వేద వైద్యుడు వైద్యరాజ్  పండిత్ బోలానాథ్  రిగి మంచం దగ్గర  ఉన్నాడు సుశీల మంచంపై ఇటూ అటూ  కొట్టుకొంటూ ఉన్నది. ఆమె కళ్ళు  అరమూ