పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిశాపతిరావు పేరును మాత్రం సార్ధకం చేసుకోడు. వట్టి నిశారావు అనవచ్చును. నల్లగా, సన్నగా , పొడుగ్గా ఉంటాడు. తెల్లని కళ్ళు, నవ్వితే తెల్లని పళ్ళు తప్ప చంద్రుని పోలిక అతనిలో ఎక్కడా లేదు. కాని అతని కంఠం మాత్రం ఉంది చూశారూ, మషామందర గంభీరతను మధించి తేర్చి తెచ్చిన వెన్నవంటిది. మనిషిని చూస్తే చీకట్లు కమ్ముతాయి. గొంతుక విప్పితే కువలయాలు విచ్చుతాయి. ఆ ప్రకాశంలో అతడు కలిసిపోతాడు.

నీ చేతులు కడుక్కుని ' స్వానిం కు బాటిల్సు ' నింపి వర్తకం చేసుకొనవచ్చు. నా తెల్లని చీరను అంటకు, చీర నల్లబడి పోతుంది అనేదాన్ని. ఇలా యేడిపిస్తూంటే అతనికి కళ్ళ నీళ్ళ పర్యంతమూ అయ్యేది. అతన్ని యేడిపించుకు తినటంలో ఇంతైనా జాలి కలిగేదికాదు నాకు.

అప్పుడు గొంతు విప్పాడా ప్రవహించేది ఒక గాఢపరిమలం మధురాతి మధురమైన మధువు., ఊళ్ళూ కోళ్ళూ యేకం చేసుకొని పరవళ్ళు త్రొక్కే మహానది. ఆ నాగస్వరం ఎదుట ఊగే పన్నగిని నేను సుడిగుండాలలో పడి కరిగిపోయిన చిన్న వాగును ! అతని గొంతుక సమ్మోగనాస్త్రం! దానిలో ఏదో తియ్యని బాధ ఉండేది. ఆ గొంతులో ఏరాగమో, ఏ పాటో ఆలాపిస్తూ, చైతన్యరహితురాలనైన నన్నా వేళ అతడేమిచేసినా దేహమూ, మానమూ,ప్రాణమూ అర్పించి ఉండేదాన్ని. ఆ గానదావానలం ముందర నా గర్యం కరిగిపోయి, నా రసజ్ఞత, నా హృదయము బయటికి స్రవించి ఆ మంటల్లో పడి బుగ్గయిపోవలసిందే.


ఇంత మహాశక్తి అతనికి ఉన్నా, అతనిలో ఒక పెద్ద లోటు ఉన్నది. నిశాపతిరావు పౌరుషం లో మార్దవం లేదు. అతనికి స్త్రీలు భోగ వస్తువులు మాత్రం అనుకుంటాడు. ' ఎలాంటి కౌశల్యము గలిగిన స్త్రీ అయినా, ఎలాంటి విజ్ఞానవతి అయినా, ఎంతటి విద్యా వంతురాలైనా అలాంటి స్త్రీ మరింత ఉత్తమమైన భోగవస్తువుగా మాత్రమే అవుతుంది' అని అతని వాదన. ఇట్టి తుచ్చ పశుత్వభావం కలిగి ఉండడం చేతనే పురుషుడయిన నిశాపతికిన్నీ, గానమూర్తియైన నిశాపతికిన్నీ సగమెరుక. స్త్రీని ముట్టుకుని గొంతుక యేత్తలేడు. గొంతుక సారించి స్త్రీని ముట్టుకోలేడు. స్త్రీ స్పర్శ మాత్రాన అతను పశువై పోతాడు. ఒళ్ళు వణికిపోతుంది. మధుపాన మత్తునిలా కళ్ళు కెంపు లెక్కి తూలిపోతాడు. కొంకర్లుపోయే అతని వేళ్ళు వనితావక్షాల పైకి ఊరువుల పైకి వాలబోతాయి.

అతని గొంతుక అంటే వెఱ్ఱి మొహంలో పడతాను. అతని గొంతుక ఆగిన మరుక్షణంలో నిండు మెలకువ వస్తుంది. నిర్వచింపలేని అతని మధుర గంభీర కంఠం నుండి స్వరమధు ప్రవాహాలు ప్రవహింపజేస్తూ అతడు ఆక్రమించివస్తే కిక్కురుమనకుండా సర్వార్పణ చేసి ఉండేదాన్ని.సంగీతం పాడుతూ గాఢ కాంక్షతో అతడు నన్ను ముట్టుకునేటప్పటికి అతని గొంతుక కొడిగట్టిన దీపంలా తుస్సున ఆరిపోయేది. అప్పుడు అతణ్ణి