పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వివాహము వాంఛించినాను. కల్మష రహితురాలైన పవిత్రురాలైన ఆ బాలిక తన మోము అటు త్రిప్పినది. నేను బ్రతికి ఉండీ బ్రతుకని వాడనే.... అని కంటనీరు పెట్టినాడు. నే నతనికడకు రెండంగలలో వెళ్ళి నిశాపతిరావుగారూ, నేను మీకో అద్భుత రహస్యాన్ని చెబుతున్నాను. హేమేకుసుమదేవి అసలు పేరు హైమావతి. ఈ బాలిక నా మరదలు. చాలాకాలం ఉత్తరాదిని సంచరించి వచ్చిన నన్నానవాలు పట్టలేదు. ఈ బాలిక చిన్నతనంలోనే, నేనూ మా అమ్మగారు ఉత్తరాదికి వెళ్ళిపోయినాము. ఆమెను వివాహము చేసుకొనుటకు మీరు మిక్కిలి అర్హులని నా నిశ్చితాభిప్రాయం. అయినా యీ బాలికలో కల్మషం లేదు. అబద్దము చెప్పలేదు. ఆమె అభిప్రాయము మార్చరానిది. నీ ఆవేదనల్ని ఉత్తమ క్షేత్ర సందర్సనంలో నెమ్మది నెమ్మదిగా మాయం చేసుకోవచ్చు. అదీకాక పరమ రహస్యము మనుష్య్డుడు గ్రహించలేడు. తన్ను ప్రేమించిన వారున్నారని అతనికీ తెలియదు. మీ హృదయం మీ ఆత్మా అర్ధం చేసుకొన్నా ఒక ఉత్తమవ్యక్తి ఉన్నది సుమండీ! ఆమె ఎవరో మీకే ముందు వ్యక్తం అవుతుంది. దాపురించిన కల్మషాన్ని దహించుకోవాలంటే మన చుట్టూ దావానలాన్ని చెలరేగ చేసుకోవాలిఅని అస్పష్టమైన మాటలతో ఆయనకు కూడా వినబడనంత మెల్లగా చెప్పినాను. నిశాపతి మరునాడు మైసూరులోని నందిపర్వతానికి ప్రయాణమైపోయినాడు.

అడ్డు రానంతవరకు మనుష్యుడు మహాప్రతాపవంతుడు. ఇనపజోళ్ళు తొడుక్కొని నడిచే మనుష్యుడు నేలక్రింద నలిగిపోయే కోమల స్వరూపాల్ని చూస్తూ వికటానందంలో ఊగిపోతాడు. ఆ ఇనపజోళ్ళను కూడా ఛేదించే కఠినత్వం అడ్డుతగిలినప్పుడు, కంటినీటితో తనకుతానే జాలిపడుకుంటూ కూలిపోతాడు.

నేను స్కూలుఫైనలు పరీక్షనిచ్చి, మా అమ్మగారితో కొల్లిపరవచ్చిన కొద్దిరోజులకు మా మేనమామతో, మా అన్నదమ్ములవారితో వినాయకరావుగారు మా యింటికివచ్చి, తన పెద్దకుమార్తె శకుంతలను నాకు వివాహం చేయుటకు సంకల్పించామనిన్నీ,