పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బావను చూస్తూ అల్లా కూచున్నాను. న అకుర్చీ అతని కుర్చీకి అతి దగ్గరగా జరుపుకున్నాను. ఏదేని వంకతో అతని చేతులుపట్టి, ఏమాటల ధోరణిలోనో అతని చెంపలు పుణికి, ఏ యాధాలాపాననో అతని ఒత్తు నల్లటి జుట్టును నిమిరి, అతని ఒళ్ళోకి వాలి, అతని కంఠము చుట్టూ చేతులు చుట్టి, అతిసంతోషం తెలపడానికి అతని నుదురు చుంబించి, శరీరం వేడెక్కి పరవశత్వం అలుముకొనిపోయి, అతని పెదవులను గాఢంగా చుంబించాను. సేసలు

నా వివాహము చెన్నపట్నంలోనే అయింది. మా చుట్టాలు ఎక్కడెక్కడివారూ వచ్చారు. నా వివాహంతోపాటు లోకేశ్వరి వివాహమూ అయింది. ఉదయలగ్నంలో మా వివాహం. లోకేశ్వరీ నిశాపతుల వివాహం రాత్రి లగ్నంలో జరిగింది. లోకేశ్వరి చుట్టాలు, నిశావతి చుట్టాలు అందరూ కిటకిటలాడిపోయారు. మా మేడచుట్టుప్రక్కల మేడలు నాలుగు విడుదులు ఏర్పాటుచేశారు. ప్రసిద్దాంద్ర గాయకుల కచేరీలు, నారాయణదాసుగారి హరి కథాకాలక్షేపం, కూచిపూడివారి నాట్యం, బాలసరస్వతీ నాట్యమూ, ఇద్దరు ఉత్తరాది గాయకుల సంగీతసభలు ఈ రెండు పెళ్ళిళ్ళ ఉత్సవాలరోజులలో ఏర్పాటయినవి. చెన్ననగరంలో ప్రసిద్దులందరూ ఈ వివిధ సభలకు వేంచేశారు. నలభీమపాకాల విందులర్పించారు మా నాన్నగారు. లోకేశ్వరికి వివాహకాలంలో మా నాన్నగారు రెండెకరాల మాగాణి పసుపూ కుంకుమ క్రింద చదివించారు. వేయి రూపాయల నగలిచ్చారు. ఈ మహోత్సవాలు జరిగిన మూడు రోజులు ఏదో లోకంలో విహరిస్తున్నట్లే ఉన్నదీ. అది గంధర్వలోకమో! స్వర్గలోకమో!

మా బావ రాజకుమారుడులావచ్చి పెళ్ళిపీటలమీద కూర్చున్నప్పుడు, నా మెళ్ళో మంగళ సూత్రం కట్టేటప్పుడు చిరునవ్వుతో మైగుబాళింపులో మేము ఇరువురము తలంబ్రాలు పోసుకునేటప్పుడు, నేను ఒక లోకోత్తర వధువునని అనుకున్నాను. మా బావ నాకు మాత్రం వినబడేటట్లు "అతివ సతీకరోన్నమితయై విభునౌదల సేసచల్లె" అని పద్యం చదివినాడు. నాకు చిరునవ్వూ, సిగ్గూ పొంగి పొర్లుకువచ్చాయి. పెళ్ళిల్లయి ప్రధమ గృహ ప్రవేశానికి త్యాగరాజనగరంలోని మా బావ ఇంటికి వెళ్ళాము.
   నిశాపతి, లోకేశ్వరులూ మా బావగారింట్లోనే గృహప్రవేశమైనారు. నిశాపతి త్యాగరాజనగరంలో సర్వోదయ పాఠశాల కెదురుగా ఒకచిన్న మేడ కొనుక్కున్నాడు. లోకేశ్వరీ, నిశాపతీ అక్కడ కాపురం ఉంటారట.