పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విపరీత వేదన నా హృదయంలో మొలకెత్తింది. అయినా ధైర్యం వీడక, శారదా సుబ్రహ్మణ్యాలతో, మా అక్క సమాధి చూద్దామని బయలు దేరాను.

   మా అక్క సమాధి మామిడితోటలో నిర్మించారట. అక్కడకు అంతకుముందే ఉదయించిన కృష్ణపాడ్యమి చంద్రుని కాంతిలో, నెమ్మదిగా అడుగులు వేస్తూ  తోటలోనికి బయలుదేరాము. శారద "అత్తయ్యా! నీ కీ ఊరు బాగా జ్ఞాపకం లేదా? అని అడిగింది.
   "లేదు శారదా! నేను మిమల్నెవర్నీ ఎరగను. మా అమ్మగారి వైపు వాళ్ళు చెన్నపట్నం వచ్చేవారు. నా అరవ ఏటనే కాదూ. ఈ ఊరువదలి చెన్నపట్నం వెళ్ళామూ!"

"నేను మా మూర్తిబావ చెన్నపట్నంలో ఉంటూన్నప్పుడు మూడు నాలుగు సారులు వచ్చానుగాని మీ యింటికి రాలేదు" అని సుబ్రహ్మణ్యం అన్నాడు.

   మా తోట వచ్చింది. ఆ తోటలో చక్కని ఎత్తయిన తులసికోట దగ్గరకు వెడుతూంటే నాకు కళ్ళు గిర్రున తిరిగిపోయినవి, అక్కా! నువ్వు లేకపోవడం నా జన్మ కిలాన్తి విచిత్ర చరిత్ర ఉదయించింది. ఏ లోకాలలో ఉన్నావు అక్కా? ఏ వెలుగురూపంతో ఉన్నావు? అని నా హృదయంత రాళాలలో కుంగిపోయాను.
   మేము ముగ్గురమూ ఆ సమాధి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ మా బావ ఆ సమాధి కెదురుగా పద్మాసనంలో అధివసించి ఉన్నాడు. అతన్ని చూచి మేము మువ్వురమూ ఆగిపోయినాము. ఆ ప్రదేశంలో చెట్లేమి లేవు కానీ, ఆ సమాధి బృందామందిరామును చుట్టి వెనుకగా ఎన్నియో పుష్పని కుంజాలున్నవి. ఆ సమాధిపైని ఆలయ మందిరం కట్టించదానికి పునాదులు తీసి ఉన్నాయి. అక్కడక్కడ రాళ్ళూ, సున్నమూ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ తర్వాత చూడగలిగాను నేను.
   వెళ్ళగానే, ఆ సమాధీ మా బావే మాకు కనబడుతా! నెమ్మదిగా వెళ్ళి, నా కాలి చెప్పులు వదలి, మా బావ పక్క కూచున్నాను. ఎదురు గుండా మా అక్క సమాధి. నా హృదయంలో ప్రార్ధానలేదు. విచారము లేదు, ఆవేదనలేదు. ఏదో కాంతి నన్నలముకుంది. అవిరళమైన నిశ్చలత, అననుభూతమైన తృప్తి అవధిరహితమైన ఆనందము నన్నలవి వేశాయి. చంద్రబింబరహిత పూర్ణజ్యోత్స్నార్ధ్రిత పరమపద మధ్యస్థ పద్మాసనా వసిత పురుషుని చెంతనే నధివసించి యున్నాను. ఎదుట ఒక మహా మందిరం. ఆ మందిరములో నేనూ, నా ఎదుట మోకరించి మా బావా! 
   ఎక్కడనుండో వీణాస్వరాలు అస్పష్టంగా వినిపిస్తున్నవి. అవి ప్రవహించి మా దగ్గరకు, దగ్గరకు వస్తున్నవి! ఇవన్నీ కరిగిపోయాయి. మా బావా, నేనూ మా అక్క సమాధి దగ్గర కూర్చుని ఉన్నాము. నన్ను ఎవరో "హేమా!" అని పిలుస్తున్నారు. నిద్రలో