పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నంద పూరితంకాగలదు. అతనిపూజ నిత్యనీల నిర్మలాకాశ పఠాత్మికమై ప్రసరించగలదు. అతడు మోహనమూర్తయై తల్పంమీద కూర్చుని ఉంటే__నేను అతని పాదాలకడ మోకరించి! అతని కళ్ళల్లోకి చూస్తూ, అతని రెండు చేతులూ నా హృదయానికి అదుముకుని, నాజీవిత సర్వస్వమూ నిండిఉన్న ప్రేమను ప్రేమగీతిగా మలచుకొని దివ్యలయగా నా బ్రతుకు స్వనిస్తూ ఉంటే, వినిపిస్తాను. అతడు నా చేతులు రెండూ తీసుకొని తన హృదయానీకి అదుముకుంటాడు. అప్పుడాతని అనన్య ప్రేమ విశ్వకృతిలో స్పందిస్తూ ఉంటే నే నా శ్రుతిలో లీనమైపోతాను! అతని ప్రేమ ఆనంద రాత్రియగు అమృతమేకాదు, నా జీవితానికి మహత్తరశక్తి ప్రసాదించి, నేను నిజమైన స్త్రీనై, సర్వమానవకోటికీ సేవచేయగలదాసినై, సర్వశిశులోకానికీ సేవచేయ గల మాతనై, సర్వ మహిళా మండలానికి సేవచేసే భక్తురాలనై, సర్వ పురుషజాతికీ సేవచేసే సోదరినై, నా భర్తకు, నా పురుషునకు, నా ప్రియునకు, నా స్వామికి అర్ధదేహినై, స్త్రీనై, ప్రియురాలినై అతని ప్రేమ సముద్రం తరిస్తూ, నా ప్రేమసముద్రంలో అతన్ని తరింపజేస్తూ ఓలలాడింప జేయగలను. ఇద్దరం ఒక మహాచరిత్ర రచిస్తాం.

   ఈలా ఆలోచించుకుంటూ, ఒకమాటు రైలువేగం గమనిస్తూ, ఆ గంటలన్నీ అతి నెమ్మదిగా ప్రవహిస్తోంటే మతిలేకుండా పుస్తకాలు తిరగ వేస్తూ, మా బావను భావించుకుంటూ, కాంక్షిస్తూ రాబోయే మా దాంపత్యాన్ని ఎదుట ప్రత్యక్షం చేసుకుంటూ, ప్రయాణం ఎలాగో__ఎలాగో చేశాను.
   రైలుదిగిన వెంటనే తెనాలిలో శ్రీనాథమూర్తి బావచుట్టాల ఇంటికి వెళ్ళాం. అక్కడ స్నానం చేశాము. వారు పెట్టిన ఫలహారాదులు నోటవేసుకున్నాము. నాజుట్టుపొగవేసి ఆరవేసుకొన్నాను. ఆరగానే వదులుజడవేసు కొన్నాను. పువ్వులు తెప్పించుకొని అలంకరించుకొన్నాను. పొందూరు ఖద్దరు చీర ఖాదీ దుకాణంనుంచి తెప్పించుకొని ధరించాను. సాయంకాలం ఏడుగంటలకు మావాళ్ళు కుదిర్చిన టాక్సీ వచ్చింది. ఆ కారులో కొల్లిపర ప్రయాణంచేసి రాత్రి ఎనిమిదింటికి చేరాము. మాతో మా చుట్టాల వారి అబ్బాయి, అతనిభార్య, చిన్నబిడ్డడూ, మా రంగనాయకమ్మత్తగారి ప్రోత్సాహం వల్ల కొల్లిపర వచ్చారు.
                                                                                                                         
           
               

మా బావగారి ఇంటిదగ్గర దిగాము. నాకేదో సిగ్గు అలుముకుపోయింది. ఆ ఇల్లు నేను చిన్నతనంలో చూచినా, అంతా కొత్తగా ఉంది. నాలో ఏదో కొత్తదనం ఆవహించినట్లయింది.

   మా బావ ఇంట్లోలేడు. అతడు గుమ్మం దగ్గరకు, మమ్ము లోపలికి ఆహ్వానిస్తూ రాలేదని గుండె గబుక్కుమన్నది. కాని అదీ మంచిదే అనుకున్నాను.
   "అబ్బాయిగోరు యినాయికరావుగారి తోటలోకి ఎళ్ళారండీ" అని ఎవరో చెప్పారు. ఇల్లంతా గడబిడగా ఉంది. భట్టిప్రోలు నుంచి శ్రీనాథ మూర్తి