పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సోఫీ : అది సిగ్గుపడుతోంది! ఊరికే దాన్ని వేపుకుతింటావేం? నువ్వు నిశారాణివి గనక, వెన్నెల కుమారివి అవుతున్నావుగా, కొండెక్కి కూర్చుంటావు. నీకేం! సీతా చెప్పవే?

   సీత : అద్గదీ! ఇందాకటినుంచీ మహావాగుతోంది! ఓ నిశారాణీ! నీకు జోహారులమ్మా!
                                                                                                                             
           
               
"వచ్చాడే మా బావా
  ఢిల్లీ నుంచీ, కల్లోనుంచీ
  నల్లనిరూపం నాలుగు కాళ్ళతో
  వచ్చాడే మా బావా!"
  లోకేశ్వరి సీతాకుమారిని కొట్టబోతే సీత పక పక నవ్వుతూ తోటలోకి పరుగెత్తింది.
   
                                                                                                                       40
   భోజనం చేసిన తర్వాత హేమకుసుమ తోటలోనికి పోయి అక్కడ సేవకుడు వేసిన పడకకుర్చీ పై పడుకొన్నది. సోఫీ, సీతాకుమారీ వెళ్ళిపోయారు. పది రోజులకన్న ఎక్కువ కాలం మనస్సు ఏ పనిమీదా లగ్నం కాదు. స్థానం తప్పిన తార అనంతపధంలో ఏ గతుల సంచరిస్తుందో ఎవరికెరుక? చంద్రుడు ఈ చతుర్దశినాడు పంచదశ కళానిదియై అమృతమూర్తయి వెన్నెల కరుళ్ళు హేమ హృదయంలోనికి ప్రవహింపచేస్తున్నా, ఆమె వేదనాగ్ని ఆ వెన్నెల ప్రవాహాలనే ఆహుతి కొంటున్నది.
   చంద్రుడు అమృతమూర్తి! ప్రేమనిధి! కళాపూర్ణుడు! కళావేత్తలకు ఆ మూర్తిలోనుంచే మహాప్రజ్ఞ ప్రవహించి వస్తుంది. ఆ బింబంలోంచి అనిర్వచనీయమైన కాంక్ష మహావేగంతో వెడలివచ్చి ప్రేమికుల బ్రతుకంతా నింపుతుంది. చంద్రుడు సౌందర్యమూర్తి. అతని ప్రియురాలు చంద్రిక సౌందర్యమూర్తి. సౌందర్యారాధనకు ఫలము ప్రేమ. ప్రేమకుసిద్ది ప్రియసంగమము. ఆ సంగమంలో శిఖరితస్థితి ప్రతివారి జీవితంలో ఒక్కసారే వస్తుంది. అప్పుడు ఆ దంపతుల బ్రహ్మానందస్థితి ఒక్క నిమేషమాత్రం పొందగలరు. ఆ క్షణం అనంతమైన శాశ్వతమౌతుంది. కాని, ఆ సంగమానికి పునాది, స్త్రీ పురుష లిరువురూ దైహిక మానసిక ఆత్మ సౌందర్యాలలో ఉన్నతులు కావాలి. ఆ మూడూ ఒక్కొక్కరిలో దివ్యశ్రుతి స్వరూపమైన రాగమౌతుంది. ఒకరి ప్రేమ రెండవవారికి మూర్చన అవుతుంది; రాగతాళ యుక్త కీర్తనలో అంతర్గతమైన రెండు వేగాలూ అప్పుడు సంగమించి చంద్రబింబ మధ్యస్థామృత భిందుసిద్ధినిపొందుతాయి. ప్రేమయొక్కపరమ స్వచ్చభావం లలితకళ. ఆ లలితకళా యోగానికి సిద్ది ప్రియసంగమం. అందుకనే లక్ష్మీనారాయస్థితి హృదయంలో,  శివపార్వతీస్థితి దేహంలో, వాణీభాత్రుస్థితి వాక్కులో, చంద్రచంద్రికాస్థితి సర్వంలో మూర్తీభవించి ప్రేమ తపస్వీతస్వీనులకు ప్రత్యక్షమవుతాయి.