పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ కథంతా హేమ తెల్లవారగట్ల నాలుగింటికి తన గదిలో కూర్చుని ఉండగా తిరువళిక్కేణి నుంచి వచ్చిన లోకేశ్వరి చెప్పి, హేమను బిగియార కౌగిలించుకుంది. హేమ కన్నీరు మున్నీరై లోకేశ్వరి కౌగిలిలో కుంగిపోయింది. మూడున్నర గంటలవరకూ హేమ తల్లి గదిలోనే ఉంది. ఆవిడ ఒళ్ళు తెలియకుండా నిదురపోవటం చూచి నర్సు వెళ్ళిపొమ్మని సైగ చేసింది. హేమ పిల్లి అడుగులు వేస్తూ, తండ్రిగారు కూడా వారి గదిలో గుర్రుపెట్టి నిదురపోవడం చూచి, తన గదిలోకి వెళ్ళింది. ఆ బాలిక గదిలోకి వచ్చిన వెంటనే లోకేశ్వరీ ఆ గదిలోకి వచ్చింది.

   లోకేశ్వరి వచ్చీరానిడంతోటే హేమను కౌగలించుకుంది. లోకేశ్వరి కన్నీళ్ళు కారుతుండగా జరిగినదంతా చెప్పింది. హేమ మంచంమీద వాలిపోయి, "లోకం! నా జన్మ వృధా అనుకుంటా. ఒక్కటి మాత్రం దాచకుండా నీతో చెబుతా. నేను తెలియకుండా మా బావనే ప్రేమిస్తున్నాను. కాని ఆ ప్రేమవల్ల నాకు బానిసత్వం వస్తుందని నా హృదయంతరాళంలో భావం కలిగిందేమో, లేదా అతని అఖండ ప్రేమకు నేను తట్టుకోలేక పోయానో? నేను ఏమీ ప్రేమించని తీర్ధమిత్రునితో పారిపోయాను. అదీ రహస్యం! నేను నా దేహం ఏ తుచ్చవాంఛతోనూ అపవిత్రం చేసుకోలేదు లోకం" అని కుళ్ళిపోయింది.
   "ఓసి వెర్రితల్లీ! నువ్వు ఎప్పుడూ, ఏ రకంగానూ అపవిత్రం చేసుకోగలవని ఎవ్వరూ అనుకోలేదు. నువ్వు శకుంతలకు చెల్లెలివి. శకుంతలకు మూడుమూర్తులా అపరావతారానివి. శకుంతల నాకు దేవి. నాకథ చెప్తా విను. "చుట్టాలింటిలోఉంది నెల్లూరులో చదువుకున్నాను. ఆ తర్వాత నాకు ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్ధినీ వేతనం వచ్చింది. ఆ కళాశాలలో చదివితే ఎక్కువ లాభం. ఎవరింటిలో ఉండను? ఆ అదను పోగొట్టుకుంటే ఎలాగూ? అని ఏడ్చాను. మదరాసువచ్చి ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాను. క్వీన్ మేరీ కళాశాల హాస్టలులో చేరాను. కొందరు రెడ్డి ప్రభువు లిచ్చిన చందాలతో కొంత కాలం గడిపాను. ఎందుకో మొదటినుంచీ నేనంటే గాఢ ప్రేమ చూపావు. మీ యింటికి తీసుకువచ్చేదానవు. నన్ను నువ్వు మీ కారుమీద తీసుకువచ్చిన మొదటరోజునే శకుంతల బొమ్మ చూశాను. మీ ఇద్దరి పోలికా అత్యంతాశ్చర్యం కలుగచేసింది నాకు. నీదేనా ఆ ఫొటో అని అడిగాను, జ్ఞాపకము వుంది కాదూ! మీ అక్క శకుంతలదన్నావు. నాకా ఫొటోలో కనబడిన వ్యక్తి ఒక దేవతే అనిపించింది హేమా. అప్పుడే ఎందుకో ఆమెకు నా మనస్సులో మొక్కుకొన్నాను. నువ్వు నన్ను తీసుకువచ్చిన నాల్గయిదుసారులు ఆ చిత్రం నాకు దేవతా చిత్రంలా కనబడి మనస్సులో నమస్కరించుకొనేదానిని. తల్లిదండ్రులు అతి బీదవాళ్ళు. తిండి సగం తినీ సగం తినకా కాలం గడుపుతున్నారు. హేమా, చదువులో మునిగి జీవించి ఉంటిని గాని మా బీదతనం నా గుండె పగిల్చి నాకు చిన్ననాడే చావుతెచ్చిఉండును. ఒకనాడు శకుంతల బొమ్మ నాతో పెదవులు కదిపి "చెల్లీ" అని పిలచినట్లయింది. నాకు కన్నీరు