పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంక : కాని బ్రాహ్మణశాఖ బ్రాహ్మణేతరులను దగ్గరకు రానివ్వరు కాదట్రా.

   త్యాగతి : అవునురా, మన్ని తెల్లజాతి దగ్గరకు రానిస్తూందిరా? మన దారిని వృద్దిపొందడం చూచుకోవాలి ఈ శాఖాభేదాలు మన దేశానికి తీరని కొరతే, కాదని నేను అనను. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు అనినట్లు భారత దేశంలో హిందువులందరూ బ్రాహ్మణులైతేనే జాతి అత్యంత పురోభివృద్ది పొందుతుంది. అందుకు మనదేశం అంతా ఏ ఉన్నతమైన బోల్షివిజమో రావాలి! మహాత్మాజీఇజం అల్లాంటిదనే నా ఉద్దేశం.
   రెడ్డి : మహాత్మాజీ ధనికులను అల్లాగే ఉండమని, వారు బీదల తరపున ట్రస్టీలని వాదిస్తారు కాదట్రా?
   త్యాగతి : ఆయన ఉద్దేశంలో ధనికులు వూంజీతత్వం వదలాలనే. అది భౌతికవిప్లవం ద్వారా కాకుండా నైతిక   విప్లవం ద్వారా తీసుకురమ్మనే ఆయన బోధ!
   వెంక : సంగీతాలకు చింతకాయలు రాల్తాయా?
   త్యాగతి : కాని డప్పులకు పెద్దపులులే బెదురుతాయి. చెట్టెక్కికోస్తే చింతకాయలూ వస్తాయి. అంతేకాని తుపాకులు పుచ్చుకొని కుందేళ్ళను చంపి, చింతకాయలకోసం చింతచెట్టు యావత్తూ నరికితే ఎల్లాగుతా?
   సరళ : ఈ సమస్యలన్నీ అవేపోతాయి. దేశం మారుతోంది. మార్పు వచ్చి తిరుగుతోంది. పాకిస్తాను అంటేగాని, ముస్లిం సోదరులు హిందువులతో సమత్వం పొందారు. అలాగే బ్రాహ్మణులను తిడ్తేనేగాని సాంఘిక సమస్యలు విడవవు. మూర్తిగారూ, మాది భావదాస్యం. బ్రాహ్మణ బావం వదలలేము. అందుకని అదంటే కోపం. ఆంగ్లదాస్యం వదలలేము: అందుకని అదంటే కోపం. ముందరమా కమ్మవారూ, కాపువారూ, రెడ్లూ, వెలమవారూ వివాహాది సాంఘిక విషయాలల్లో ఒకటైపోతే బ్రాహ్మణులు ఏంజేస్తారు? ఉద్యోగాలకోసం ఈ ఏడ్పంతా! బ్రాహ్మణేతరులలో కమ్మవారు, వగైరా, చాకలి వగైరాలతో పెళ్ళిళ్ళూ పంక్తిభోజనాలూ చేస్తారా? పనిచేసే వారు లేరు. వాగే వాజమ్మలు ఎక్కువ. రెడ్డి మంత్రయ్యాడని కమ్మవారూ; వెలుమలూ, కాపులూ మండిపోయారు. ఇంక చాకలివారూ, మంగలివారు, కమ్మరివారు, గొల్లవారు, గాజులబత్తులు, జక్కులవారు, కుమ్మరివారు, ఉప్పరులు, దొమ్మర్లు, కరణిబత్తులు, పద్మశాలీలు, ఏనాదులు, మాలలు, మాదిగలు, ఎరుకలు ఈ వగైరాలంతా ఏకమైతే ఎంత బాగుంటుంది!                                                                                                                           
           
               
                                                                                                                    38

హేమసుందరికి తన బావ కొల్లిపర వెళ్ళినాడని, అతను వెళ్ళిన సాయంకాలం తన ఇంటికి వచ్చిన, రంగనాయకమ్మగారు తన తల్లితో చెబుతోంటే విన్నది. వెంకట్రామ రాజ్యలక్ష్మమ్మగారు చాలావరకు ఆరోగ్యం పొందారు. అయినా కొన్నాళ్ళవరకూ పూర్తి విశ్రాంతిగా పండుకొని ఉండాలని డాక్టరు ఆజ్ఞ.