పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సరళ : అందుకనే శ్రీనాథమూర్తిగారు ఇంతవరకు ఆమెనే ధ్యానిస్తూ, ఆమె స్మృతికోసం జీవిస్తున్నారు. అయితే లలిత కళాశాల అంటే ఏం పెట్టాలని మీ ఉద్దేశం?

   త్యాగతి : లలిత కళలు ఒకదానికొకటి అతి సన్నిహిత సంబంధం కల పంచనిదీ పరివేష్టితమైన పంజాబు వంటివి.
   సూర : అది కాదురా. ఆ కళాశాలలో ఎవరు చేరుతారురా! శారదానికేతనానికే, విశ్వవిద్యాలయ పరీక్షలు లేకపోతే ఎంతమంది చేరే వారని నీ ఉద్దేశం?
   త్యాగతి : ఒరే రెడ్డీ, నీవి ముసలమ్మల భావాలు. సంవత్సరానికి ఒకరైనా ఆ కళాశాలలో శిక్షణ పొందితే చాలు, ఆ కళాశాల పెట్టిన ఉద్దేశం నెరవేరుతుందనే నా ఆశయం.
   వెంక : ఇంతకూ ఏలా ఏర్పాటు చేస్తావు? ఎవరు ఆ కళాశాల అధ్యక్షత వహించేది? ఎవరు అందుకు ఆచార్యులు?
   త్యాగతి : మీ ఆవిడవంటి ఏ ఉత్తమురాలో అందుకు అధ్యక్షత వహించకూడదా?
   సరళ : నేను తప్పకుండా మీ కళాశాలలో పనిచేస్తా సుమండీ.  
   త్యాగతి : మీకు కృతజ్ఞున్ని. అయిదు కళలు__సాహిత్యం, చిత్ర లేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం అన్నీ వుంటాయి. ఆ కళాశాలలో సాధ్యమయినంతవరకు స్త్రీలే ఆచార్య పీఠాలు అధివసిస్తారు సరళాదేవి గారూ__
   సరళ : నన్ను "గారూ గీరూ" అనకండి మీరు.
   త్యాగతి : నన్ను "మీరూ గీరూ" అనకమ్మా! నాకూ, చౌదరికి, రెడ్డికి వున్న స్నేహం అలాంటిది.
   వెంక : ఇన్నాళ్ళనుంచీ ఒక ముక్క రాశావూ! నీగతి ఏమయిందో మాకు రాయడంగాని, మా గతి ఏమయిందో నువ్వు తెలిసికోడంగాని ఏమీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరిగావు. మీ బాపనాళ్ళెప్పుడూ అంతే లెద్దూ.
   త్యాగతి : తెచ్చావు బ్రాహ్మణ అభ్రాహ్మణ సమస్య! ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాలకూ బ్రాహ్మణులే కారణం అని అనేకమంది మిత్రులు అనుకుంటారు. అధి లోక దౌర్భాగ్యం. బ్రాహ్మణుల సమాఖ్య తక్కువ. వాళ్ళని అణచి వెయ్యాలంటే తక్కినవారికి అయిదు నిమిషాలు పట్టదు. బ్రాహ్మణులు ధనవంతులూ కారు, ఆస్తివంతులూ కారు. బలంలేని ఒక శాఖ విషయంలో "అదిగోరా! అధిగోరా! బ్రాహ్మణుడు" అని అడలిపోవడం ఎందుకు?
   వెంక : ఒరే మూర్తీ, బ్రాహ్మణుడు సహపంక్తిని భోజనం పెట్టడు.
   త్యాగతి : మదరాసు గవర్నరు పెడ్తాడూ!
   వెంక : మనం గొప్పవాళ్ళం అయితే, మన్ని భోజనానికి పిలవడానికి వీలుందిగాదురా?
   త్యాగతి : నిజమే, అంత గొప్పవాడవైతే, బ్రాహ్మణుడు సంఘ సంస్కర్త అయితే నిన్ను సహపంక్తి భోజనానికి పిలవవచ్చుగాదా అంట!