పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇందులో ఎవ్వరికీ ఆవేశాలు ఉండకూడదు. హేమ ఎంత బాధ పడిందో? ఏదో ఆడుతూ, పాడుతూ, అల్లరిచేస్తూ బాలికాత్వం ఇంకా వీడని బాలకు ఏవేవో వెర్రిసమస్యలన్నీ పెట్టి అనవసరపు కలతలు తీసుకొని వచ్చాడు తాను....ఈ రోజు కనకలత జీవించకపోతే ఆ చావుకు తానే కారణం అవుతాడు. కావలిస్తే లోకేశ్వరి పెళ్ళికి ఒక్కసారి వచ్చి చూచి పోవచ్చును. ఆ మర్నాడు త్యాగతి తల్లి హేమగారి ఇంటిదగ్గరనుంచి వచ్చీరాగానే ఆమెను చూచి, "అమ్మా! మనం కొల్లిపర వెళ్ళాలి. నేను పెట్టదలచుకున్న శకుంతలా లలితకళాశాల అలా వుండిపోయింది. ఇంక వెళ్ళిపని ప్రారంభిస్తాను."

   రంగ : నాన్నా, ఈ ఇల్లూ అవీ?
   త్యాగతి : ఇవి ఇలాగే వుంటాయి, నేను మధ్య మధ్యవస్తూ వుంటాను. ఆ కళాశాల బాగా పని ప్రారంభించగానే ఇక్కడి వచ్చేశాను. ఇకిక్కడ పురుషులకు లలిత కళాశాల ఏర్పాటు చేస్తాను. నువ్వు అత్తగారికి బాగా కులాసా కాగానే కొల్లిపర వచ్చేయి. లేదా యిక్కడే ఉండటం మంచిది.
   రంగనాయకమ్మగారు ఏమీ మాట్లాడలేకపోయింది. సరేనని తల ఊపింది. తల్లి భావం త్యాగతి గ్రహించాడు. అయినా తన ధర్మం తాను నెరవేర్చాలి గదా! ఆ సాయంకాలం పెట్టే బేడా అన్నీ సర్దుకొని, తల్లిని హేమగా రింటిదగ్గర దిగవిడిచి, సెంట్రల్ స్టేషనుకు పోయి కలకత్తా మెయిలు ఎక్కాడు.
   
                                                                                                               36
   కనకలత ఒళ్ళు కాల్చుకున్న మర్నాడు ఉదయానికే తీర్ధమిత్రుడు చెన్నపట్నం వచ్చాడు. హేమసుందరి తిరువళ్ళూరు స్టేషను దగ్గర దిగిపోతుందని అతను కలలోనైనా అనుకోలేదు. అతడు మండిపోయాడు. అతి కోపంతో అతడు ఏడ్చాడు. రైలులోనుంచి ఉరుకుదామనుకున్నాడు. అలా ఉరకడం చూసేవారెవరూ లేక మానివేశాడు. మాట్లాడకుండా ఆ మెత్తటి సీటుమీద పడుకొన్నాడు. దొర్లాడు. చేతికి దొరికిన పండు దొర్లుకు పడిపోయింది. తన మగతనానికి ఎంత తీరని అవమానం! తన చరిత్రలో ఈలాంటిది ఎప్పుడూ జరుగలేదు. షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఆ విస్తరి మళ్ళా లాగివేసినట్లయింది!
   హేమ వట్టి దద్దమ్మ; ధైర్యంలేని పిరికి చచ్చమ్మ. ఇలాంటివాళ్ళను కాళ్ళూ చేతులూ కట్టేసి, చీరలు, జంపర్లు, బాడీలు ఒలిచి, బలవంతంగా..నాశనం చేయాలి. కానీ, తాను ఇంతటితో వదులుతాడా ఆ కులుకురాక్షసిని? దానిలోని సౌందర్యరసం యావత్తు పీల్చి ఆ త్యాగతికి పిప్పి మాత్రం వదలాలి. ఏమో! హేమవంటి చదువుకున్న బాలిక తనకు లొంగుతుందా? పైగా ఉద్యోగానికి మొప్పం రావచ్చును. ఏ త్యాగతికో కోపం వచ్చిందంటే, ప్రాణంపోయిఊరుకుంటుంది. ఇప్పటికే వాళ్ళు మండిపోతూ ఉంటారు. రైలు ఆర్కోణం వచ్చింది.