పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వినాయకరావుగారు కొమరితవంక తీక్షణంగా చూచి, "నాన్నా, నువ్వు ఎక్కడానుండి వస్తున్నావు?" అని ప్రశ్నించారు.

   "నాన్నగారూ, నన్నిప్పుడేమీ ప్రశ్నించకండి. ఒక్కటి మీరు నన్ను గురించి అనుమానపడవలసిన కారణం ఏమీలేదు. సర్వదేవతల సాక్షిగా నేను శకుంతల చెల్లెలిని. వెంకట్రామరాజ్యలక్ష్మమ్మగారి కూతురను. నా దేహము, నా ఆత్మ సీతాదేవి అవతారంలా నిర్మలాలు." అంటూ దొనదొన కంటినీరు వెల్లువగా వస్తూవుంటే తుడుచుకొంది. వినాయకరావు గారు మరి మాట్లాడలేదు. కుమార్తెను దగ్గరగా తీసుకొని గుండె కదుముకున్నారు. ఆయన ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, నిరభ్యంతరంగా కారిపోయే కంటినీరును తుడుచుకోవడం మానివేశారు.
   డాక్టరు లోపలికి వెళ్ళినప్పటికి ఒక నర్సు రాజ్యలక్ష్మమ్మగారికి పరిచర్య చేస్తూ వున్నది. డాక్టరుగారు వెళ్ళి మంచందగ్గర కుర్చీమీద కూర్చున్నారు. రాజ్యలక్ష్మమ్మగారి చేయి తీసికొని, నాడి పరీక్ష చేస్తూ "రాజ్యలక్ష్మమ్మగారూ! ఇప్పుడు మీ వంట్లో ఇందాకటికన్న నయమేనా?" అని అడిగారు.
   "రాజ్య: (నీరసంగా సన్నని గొంతుకతో) నయమేనండీ. ఎందుకాండీ నయం డాక్టరుగారూ?
   డాక్ట: ఈపాటికి వాళ్ళు వస్తూ ఉండవచ్చును.
   రాక్యలక్ష్మమ్మగారు 'ఎవరండీ' అంటూ నీరసంగా ఆ డాక్టరుగారి వైపు మొగం తిప్పింది.
   డాక్ట : మనవాళ్ళే!
   రాజ్యలక్ష్మమ్మగారు మాట్లాడకుండా డాక్టరుగారివైపు చూస్తున్నది.
   డాక్ట : మీనాడి చాలా బాగుంది. అచ్చా! వీరందరూ ఎప్పుడూ తిరగడమే! ఇంకా వచ్చారుకాదేమో?
   రాజ్య : ఎవరండీ?
   డాక్ట : మనవాళ్ళేనండీ, హేమా వాళ్ళూనూ!
   రాజ్య : హేమా? హేమ....?
   డాక్ట : హేమ నాతో చెప్పింది. నలుగురం కలిసి ఇక్కడే ఒక దగ్గిర ఊరు చూసి పదిలోపుగా వస్తామని. ఇంకా వచ్చింది కాదే?
   రాజ్యలక్ష్మమ్మగారు మాటలేకుండా తెల్లబోయి చూస్తున్నది.
   డాక్టరు నాడి పరీక్షచేస్తూ, కొంచెం నాడి ఒడుదుడుకు పడడం కనిపెట్టి "ఆఁ....హేమ ఇంకా వచ్చింది కాదు. పోనీ లోకేశ్వరి యెక్కడకు వెళ్ళిందో? హేమ సరిగా పదిలోపుగా వస్తానని నాతో చెప్పింది. త్యాగతి గారూ, ఆమె ఒక కారులో కూర్చొని ఉన్నారు. నర్స్, నువ్వు వెళ్ళి అమ్మాయి వచ్చిందేమో చూడు."
   రాజ్య : అమ్మాయి రాదండీ. మీతో పదింటిలోపుగా వస్తానందా?
   డాక్టరు : (రాజ్యలక్ష్మమ్మగారి మాటలు విననట్లు నటించి) త్యాగతి గారూ ఆమాటే అన్నారు. ఎప్పుడు నాకు వాళ్ళిద్దరి కారు కనబడింది చెప్మా? ఆరున్నర....కాదు....ఆరూ ఇరవై ఇంటికి.... ఆఁ....అవును; ఆరూ ఇరవై ఇంటికే!