పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని అతి కష్టంలో ఆ అశ్రువులు కళ్ళవెనకే ఆపుచేసికొని,ఒక చిరునవ్వు నవ్వింది.

   బొంబాయి మెయిలులోంచి దిగటంతోటే,హేమకు కోటి బరువులు తలపై నుండి బొర్లి పాతాళంలో పడినట్లయింది.ఆమెకు కలిగిన స్వేచ్చా భావం స్వచ్చమైంది.ఆమె ఎన్ని యుగాలనుంచో తన్ను కట్టిన గొలుసును తానే నిశిత మహాపరశువుతో ఖండించినట్లయింది.ఏ బాని సత్వాన్నుండి తన్ను తాను విముక్తి చేసుకుంది?తననుండి తన్నే విముక్తి చేసుకున్నానని ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది.తానే స్పష్టంతాల్చని,అర్ధంకాని,కుడురుకనని,భావశృంఖలాలను వేసుకొనితనచేతులకు,కాళ్ళకు,హృదయానికి,మనస్సుకు,జ్ఞానానికిలంకెలపోగుచేసుకొంది.తన చుట్టూ తానే గోడలు కట్టుకుంది.
   తన బావ త్యాగతి ప్రోత్సాహంవాళ్ళ,ఎన్నో వేదాంత గ్రంధాలు చదివింది.అవి తన మెదడులో ఆరగ లేదు.బౌతికంగా స్వేచ్చ ఎవరికీ లేదు.తాను తండ్రికి కుమారైకాకుండా ఎలా ఉండ గలదు?ఆయన వెనక భట్టిప్రోలువారి తరాలెన్నో ఉన్నాయి.తనకూ తన తల్లికి ఉన్న సంబంధమూ అంతే.తాను భారతీయ నారి కాక నేట్లు?తన బంగారం దేహం పాశ్చాత్యచ్చారుణ శరీరం ఎల్లా అవుతుంది? ఈలా ఎవరికైనా కుటుంబ, సంఘ, జాతి, దేశాల లంకె లుండనే ఉంటాయి. గాలి, నీరు భోజనము లంకెలు! దేశకాల పాత్రలు లంకెలు! "ఇంక భౌతికమైన స్వేఛ్చ అంటే ఈ లంకెలతో శ్రుతిసామ్యస్థితి కలిగి ఉండడమే" అన్న త్యాగతి మాటలు అఖండ సత్యవాక్కులు.
   ఎవరైతే ఆ సామరస్యం కావాలని పాడుచేసుకుంటారో, వారు తమకు తమి నిజమైన శృంఖలాలు తగిలించుకొంటారు. మనం చైతన్య రహితంగా పడిఉండడం అర్ధంలేని స్వేఛ్చ. చైతన్యంరాగానే ఆ స్వేఛ్చకు మనమే భంగం కలిగించుకొని శ్రుతిని సమకూర్చుకుంటే మాట్లాడుతాము, నడుస్తాము. ఆ శ్రుతిపోతే తల్లక్రిందుగా పడతాము. అడవి పెరగడం అయిదు నిమిషాలు. అడవి భూమిని వ్యవసాయ భూమిగా చేయడం, ఆ భూమిని వ్యవసాయ భూమిగానే ఉంచడం ప్రకృతికి అసత్య స్వేఛ్చ తీసి వేసి, నిజమైన స్వేఛ్చ ఇవ్వడం. స్వేఛ్చ అంటే మెదదును ఇష్టంవచ్చినట్లు పోనివ్వడం కాదుగదా! అయితే అది పిచ్చి అవుతుంది. కట్టుబాటులు, నియమాలు నిజమైన స్వేఛ్చ!
   స్త్రీ కూడా దేశానికి ప్రపంచానికి అభ్యుదయ కృషి అర్పించాలి. అది నియమాలలో జరగాలి. రైలు పట్టా తప్పితే రైలుకు స్వేఛ్చలేదు. ఆవిరి ఇంజనులో లేక ప్రపంచం అంతా ప్రవర్తిస్తే దానికి స్వేచ్చా? మనుష్యునికీ అంతే! తన నిరర్ధక జీవితానికి ఈ శుభముహూర్తాన్నుంచీ స్వస్తి! తన శ్రీనాథమూర్తి బావతో కలసి.....తన శ్రీనాథమూర్తి బావా! ఉత్తమ పురుషుడు. తన బావ ఉత్తమ పురుషుడు అంటేనే ఇన్నాళ్ళ నుంచీ తాను పూజించింది. అతన్నే తాను ప్రేమించింది. అతడే తన కుడి చేయి. అతడే తన జీవితానికి తరణి.