పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గల తన చేతిసంతి తీసింది,_ ఏదో వెడనవ్వు,వికారపు మెరుగులు ఆమె మొగమున ప్రసరించి, ఆమె మోమును భయంకర రేఖ లతో నింపాయి.ఆ సంచిలోంచి వందరూపాయలవి నాలుగునోట్లు తీసింది.అవి చేతితో పట్టుకుంది.రైలు పెట్టె తలుపుతీసి గుమ్మం దగ్గర నిలుచుంది.రైలు తిరువాళ్ళూరు స్టేషనులోకి వచ్చి నిలిచింది. హేమ తలుపు తీసినప్పుడు తీర్ధమిత్రుడు హేమవైపు చూచి,"జాగ్రత్త హేమా!"అన్నాడు. హేమ అలా నుంచోడం చూశాడు. నోట్లు చూడలేదు.

   ఇంతలో గార్డు అలా ఈలలు,స్టేషను గంటలు మ్రోగాయి. రైలు కదలడం ప్రారంభించబోయే ముందు హేమ గుమ్మంలో నుంచే తీర్ధమిత్రుని వైపు తిరిగి,"క్షమించవోయ్ నన్ను.నేను పిరికిదాన్ని. ఇవిగో ఈ నాలుగు వందలూ" అంటూ ఆ నోట్లు సీటుమీదకి విసిరి వేసి,క్రిందికి దిగి తలుపు వేసి,తన సంచి చేతిలో విడిగా పట్టుకొని ఉన్న రైలు పెట్టె తాళం చెవితో రైలు కదిలి వెడుతుం డగా తాళం వేస్తూ,"నువ్వి దిగకు,నేను వెడుతున్నా.నాకు ధైర్యం చాలదు, పైగా నీమీద నాకేమి ప్రేమలేదు"అంటూ రైలు వేగం కాగా ప్లాటుఫారం మీద నిలుచుండిపోయింది.
                                                                                                                    ౩౩ 
   రైలువేగం ఎక్కువైంది.తీర్ధమిత్రుడు తెల్లబోయాడు.వెంటనే హేమ దిగిన గుణ్ణందగ్గిరకు వచ్చి తలుపు లాగితే రాలేదు.కిటికిలో నుంచి తొంగిచూశాడు.హేమ ప్లాటుఫారం మీద నుంచి స్టేషనులోనికి వెడుతూంది.రాక్షసి!పిశాచి!అల్లా తన్ను అవమానపరచి పారిపొయింది ఈ మూడు రోజులు పని ముక్కలే!ఈ లాంటి దొంగ స్త్రీను,పాడు స్త్రీలను బలవంతంగా పాడుచేసి నాశనం చేస్తేగాని లోకం బాగుపడదు.తన మగతనానికి తీరని అవమానం చేసింది.పోతేపోనీ,ఏదో నాలుగు వందల సంపాదన అయింది. ఈ పెట్టెలూ మొదలయిన హేమ సామానూ తనదే!రాక్షసి!                                                                                                                           
           
               

హేమ రైలు కదలగానే వెనక్కు పోయింది.తిరువళ్ళూరు నుంచి ఎనిమిదింటి కొక బండి,ఎనిమిదిన్నరకు ఒక బండి చెన్నపట్నం పోతాయి.అప్పుడైంది గం "7-40లు.ఆమె గడియారం చూచి వెంటనే టిక్కెట్లు అమ్మే స్థలానికి పోయి,మదరాసుకు సెకండు క్లాసు యిమ్మని,కొనుక్కొని,తిన్నగా అవతలి ప్లాటుఫారము మీదకు వంతెన మిద నుంచి దాటి అక్కడ సిద్ధంగా ఉన్న బండిలో,స్రీల రెండవ తరగతి పెట్టె ఎక్కి కూర్చుంది.

   ఆ పెట్టెలో ఇద్దరు యూరోపియను బాలిక లెవరో ఉన్నారు.వారిద్దరూ హేమ వైపు తేరిపార చూచారు.ఒకామో హేమనుచూచి,"మీరేనా,స్రీల టెన్నిస్ పందెంలో సోఫీ గారితో కలిసి మొదటగా వచ్చింది"అని అడిగింది."అవును"అని హేమ నెమ్మదిగా అన్నది.ఆ ముక్కలు మందిపోయే హేమ హృదయాన్ని చల్లార్చినాయి.ఆమెకు కంటనీరు తిరుగబోయింది