పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్యాగతి మహోన్నత పురుషుడు తన అక్క పేర లలిత కళాశాల నిర్మిస్తాడట! అతడు పర్వతము, మహానది, సముద్రము, నిర్మలాకాశం!

   ఇంతమంది ఉత్తములను ఏడిపించి తాను సఱున ఈ తీర్ధమిత్రునితో పారిపోయి వస్తోంది! తీర్ధమిత్రుడంటే తనకేమి ప్రేమలేదు. లేదని నిశ్చయం.ఎందుకు ఇతనితో...ఈలా. లేచిపోవడం?
   కల్పమూర్తీ!నీతో లేచిపోతానంటే. అతడు ప్రాణం వదిలేస్తాడు. త్యాగతితో అంటే ఒక చిరునవ్వు నవ్వి చంటి బిడ్డను మారాము తీర్చినట్లు తీరుస్తాడు.ఈతడు పండ్లలాంటి బిడ్డల సంగతి ఆలోచింపక, బంగారు బొమ్మలాంటి భార్య విషయం తల పెట్టడం తనతో కామవాంఛ తీర్చుకోడానికి "రా"అంటే సిద్ధమై వచ్చాడు. తన్నో!తాను దేశసేవ చేస్తుందట! మానవ సేవ శిష్యురాలట! పరిశుద్ధమైన అగ్ని లాంటి బోల్షవిజానికి ఈ కళంకం ఎందుకు ఆపాదించడం?తన త్యాగతి...తన త్యాగతా? ఛీ! అలా అనుకోడానికి తన బోటి దద్దమ్మ తగునా? 
   ఛీ!ఛీ!తన ఈ చచ్చు ఆలోచలేమిటి? ఏం తప్పు చేశానని? తన ఇష్టం తన రాజ్యం.. ఎవరయ్యా ఈ విశాల ప్రపంచంలో తానుచేసిన పనిని తప్పు అని అనగల వారు?ఈ సంఘ మట!పాడుసంఘం!ప్రతివ్యక్తిస్వాతంత్ర్యానికిఅడ్డం.తానొక పెద్దడిక్టేటరా?మనుష్యుల జీవితాలు,కుటుంబాల జీవితాలు తన రక్షాసి చేతుల్లో నలిపి వేసి భయంకర ఢాకిని ఈ సంఘం ఎన్ని విధాల ఈ సంఘాన్ని నాశనం చేయాలో అన్నీ విధాలా చేయాలనే కాదా తా నీ రకంగా చేస్తునది.అందులో ఈ సంఘం స్రీ పురుష సంబంధం విషయాల్లో మరీ మహా మారణపిశాచి!ఆ విషయంలో ధైర్యమున్న వీరనారులు ఏది సంఘంలో అరాజకత్వం తీసుకురావాలి!ఆ సంఘ రాక్షసత్వానికి ఎవరు తోడుపడతారో వారు ఎవరైనా సరే నాశనం కావాలి.తన తండ్రి నాశనం కావాలి.తన తల్లి నాశనం కావాలి. ఆమె బిడ్డలు నాశనం కావాలి. కల్పముర్తీ, లోకేశ్వరీ, సోఫీ అంతా నాశనం కావాలి. తీర్ధ మిత్రుడు నాశనం కావాలి తానోక్కటే ఈ అఖండ నాశనం ఈ మండే కాష్టాలు,ఈ కుళ్ళే శవాల మధ్య నుంచొని,కొత్త సంఘం సృష్టిస్తుందీ! ఆహా అందుకు పురుషుడేడీ?ఎవరు?తామాలోకంతోపాటు.. చావనీ...చావనీ...కొత్త సంఘం....
   రైలు వేగంగా వెడుతూ చెవులు గింగురంటూ కూత కూసింది. హేమకు మెలకువ వచ్చింది.ఒక్కసారిగా లేచింది.నూట ఇరవై రూపాయలు విలువ