పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆనందంతో చూస్తే నువ్వు ఉప్పొంగిపోతావు.మగవాడి కోటుచివర నీ చీరను స్పృశిస్తే నువ్వు స్వర్గలోకం అందుకున్నా నను కుంటావు.హేమకు తల తిరిగింది తాను చదివిన చదువు దద్దమ్మ చదువు.ఎవరైనా చదవ గలరు.ఎవరైనా పరీక్షలలో నెగ్గగలరు.ఒక్క గొప్ప చిత్రమైనా వేయలేక పోయింది.ఒక సంగిత సభ పండితుల ఎదుట చేయ లేక పోయింది.తన కంటె లోకేశ్వరి నయం.పరిక్షలో జయంమంది.పాఠశాలో పాద్యాయినిఅయి,ఒంగోలులో ఉన్న తన బీద కుటుంబానికి డబ్బుపంపి,పోషింస్తోంది.రేపు నిసాపతిని__జగత్ ప్రఖ్యాతికన్న జగపతిరావును__పెళ్లి చేసుకో గలుగు తోంది!ఇంక భాగ్య వంతుల బాలిక అయిన తాను త్రండ్రి తనకై పెంచిన డబ్బు చచ్చు పుచ్చు ఖర్చులు చేస్తూ,రక్తం పిల్చే దోమ జీవితం జీవిస్తోంది.


ఓహో!ఏమి గొప్పఆడది!స్రీజీవితంతానటఉత్తమంయడానికి...సంకల్పించుకొన్నదట!తన కోసం చెన్న పట్నం మకాం పెట్టుకొని ఒక్క మాట వల్లనైనా,ఒక్క చూపు వల్లనైనా,ఒక్క చేత వల్లనైనా మనస్సుకు ఈ షణ్మాత్రం నొప్పి కలిగించకుండా,తన్ను దివ్య ప్రేమ కాంతితో నింపిన తన బావ అంటే వెర్రికోపం పడి చెవుల మిద కోపంతో ముక్కు కోసుకున్నట్లు,తానీ తీర్ధ మిత్రునితో,ఒక అతి బలహినురాలిన ఒక స్రీ లేచి పారిపోయినట్లే లేచి వెడుతోంది.తన తల్లిదండ్రులు ఈ సంగతి గ్రహించగానే చచ్చిపోయే మాట నిశ్చయం.అనుమానం లేదు. ఎంత చక్కని కూతురు తాను! ఎంత గొప్పకూతురు! తాను తీర్ధమిత్రుని నిజంగా ప్రేమిస్తోందా?తీర్ధ మిత్రుని ఏమి అనకూడదని తన బావతో దెబ్బలాడి వచ్చి, ఇతనితో తాను లేచిపోతోంది.

   మహాప్రళయం లోకాన్ని ఆవరిస్తుంటే, తాను చేయ వలసిన కర్తవ్యం ఆలోచించు కోలేదు. పైగా ఒక నీరసపు ఏకాంకిక రాసి పురుషులను తిట్టించింది.ఛీ! హేమ!నువ్వు పరువు లేని దానవు. ప్రతిష్ట లేని దానవు. నీవన్ని వట్టి డాంబికాలు. ఏ ఆవేశాలు,నీ కోపాలు,నీ గడబిడలు,నీ సంవత్సరాది ఉత్సవాలు ఒక పిచ్చిదాని చేష్టలు. పెద్దకూతురు పోతే,నిన్ను దేవకన్యలా పెంచిన తల్లిదండ్రుల విషయం ఇంతైనా ఆలోచించని అతి అమానూష స్వలాభపూరిత హృదయం  కల రెండవ కూతురవు.నీ అందం నువ్వు చూసుకున్నావు. నీ డాబులు నువ్వు కులుకుకున్నావు. నువ్వు నిన్ను చాటుకున్నావు. నువ్వు రాక్షసివి. పిశాచివి. తన తండ్రి పువ్వులా పెంచాడు. లోభి తన ధనాన్ని కాపాడుకోనేటట్లు తల్లి తన్ను కాపాడింది.వారికి తనేమి ప్రతి ఇచ్చింది?
   కల్పమూర్తి కుక్కకన్న,గుఱ్ఱంకన్న ఎక్కువగా తన్ను అనుసరించాడు. తన కనుసన్నల ఆజ్ఞను, ఒక పూర్వకాలపు సుల్తాను ఆజ్ఞలను బానిసలు నిర్వర్తించినట్లు నిర్వర్తించాడు. వెలిగించాడు.