పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమ సైదా పేట దగ్గర అడయారు నది వంతెన మిద కారు ఆపు చేసి తీర్ధ మిత్రుని దిగమని,"తిర్ద్!నేను నీ చేతికి టిక్కెట్టు వగై రాలకు డబ్బు ఇస్తాను.మనం బుధవారం ప్రయాణం.ఈలోగా సోమ మంగళ వారాలు బీచి దగ్గర కలుసుకోవడం.అక్కడ నా సామాను నీకు అందిస్తాను"అని చెప్పింది.

   ఆమె ఏర్పాట్లు ప్రకారం అన్నీ జరిగాయి.కాని రైలు కదలటం తోటే ఆమె చుట్టూవున్న సర్వ ప్రపంచం ఒక్కసారి కుంగినట్టయింది.రైలు చక్రాలు తిరిగికొలదీ,వానితో పాటు  ఆమె ఆలోచన భ్రమణమూ  ఎక్కువైంది.రైలు చక్రాలు పట్టాలమిద నడుస్తున్నాయి.ఆమె ఆలోచన్ చక్రాలు శూన్యంలో నడుస్తున్నాయి.రైలు క్రింద చెప్పుడుకూ,ఆమె హృదయం చప్పుడుకూ ఎక్కడా శ్రుతి అందడం లేదు.తీర్ధమిత్రుని మొగం వైపు చూడలేకపోయింది.రైలు ఎక్కడకు పోతోంది?ఈ రైలు ఇంకో రైలును డీకొని ముక్కలైపోతుందా?అందులో తానూ ఖండ ఖండాలుగా పడి వుంటుందా?
                                                                                                            32
   రైలు అతివేగంగా పరుగు పెడ్తున్నది.చిన్న పేటలు వెనక్కి మెరుములా మాయమవుతున్నాయి.చిన్న స్టేషన్లు కనబటం,అంతట్లో మాయమవడం!కొత్త కాలం అవడం వల్ల ఇంకా చీకట్లు రానే లేదు.
   స్రీలకు భయంలేదా?దైర్యం లేదా?ఇలా పురుషునితో పారి పోవడమా!చెన్న పట్నంలోనే వుండి,తాను తనకు యిష్టము వచ్చిన పురుషునితో నిర్భాయముగా జీవించలేక,ఎందుకు ఇలా రహస్యంగా దొంగలా ఈ తీర్ధమిత్రునితో పారిపోవడం?అని హేమకు తిరిగితిరిగిఆఆలోచనేవచ్చింది.తానుతల్లిదండ్రులకుభయపడింది.త్యాగతికిభయపడింది.స్నేహితులకు భయపడింది.త్యాగతా?తనతల్లినికూడాతీసుకుదుఃఖాన్నుండిపారిపోయాడు.ఒక్కడూ తిరిగాడు.నీరసించిన మనస్సుతో సుశీల అనే ఆ అమ్మాయితోఒకసారి...అన్నీపురుషునిలా చేశాడు.అదీ పురుషత్వం!ఏదో ఆశయం పెట్టుకున్నాడు.దానికై ఆస్తులమ్మాడు.దేశాలు తిరిగాడు.మనస్సులో వచ్చిన భావాలన్నీ తనకు వ్రాసి చూపించాడు.
   తానో!పిరికిపందలా ఈలా పారిపోయి వస్తోంది!తల్లిదండ్రుల సంగతి ఆలోచించిందా?వాళ్ళు తనమీద సర్వభారమూ ఉంచి,తనకు సర్వ స్వాతంత్రాలూ ఇచ్చి తనకై బ్రతుకుతూ వుంటే,వాళ్ళ విషయం ఆలోచించకుండా...ఎందుకు ఇల్లా తాను తీర్ధమిత్రునితో పారిపోయివస్తూన్నట్లు?తన సర్వస్వం వదలి,అతన్ని అనుసరించేటంత ప్రణయం తీర్ధమిత్రు డంటే వున్నదా?
   
   "ఓ హేమా!నువ్వు వెఱ్ఱదానవు,నువ్వు చచ్చుదానవు.నువ్వు జజ్జమ్మవు.మగవాళ్ళ కోసం ప్రాకులాడే జావకడి ఆడదానవు.మగవాడి చూపులు నిన్ను