పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోయింది.అతని పై మన్మధుడు మామూలు పూలబాణాలు వేయ లేదు.ఇప్ప పువ్వులు,గసగసాల పువ్వులు,నాభి పువ్వులు,కాసింత పువ్వులు,పుఖాంను పుంఖాలుగా డబ్బాతు వర్షంగా కురిపించాడు.అతనికి మదన జ్వరం 112డిగ్రీల వరకు వెళ్ళింది.

   ఇదివరకు తాను మన్మధ మహాసామ్రాజ్య నిర్మాణము చేయడంలో పొందిన విజయాలు,ఏ గ్రీసు,టర్కీ యుద్ధమో వంటిది.ఈ రోజు పొందబోయే విజయం 1914యుద్ధం వంటిది.ఈ హేమకుసుమసుందరీ దేహమే తాను నిర్వహింపబోయే కామరాజ సుయయాగానికి యజ్ఞ వేదిక.తనలోని కందర్ప రసజ్ఞత ఇంధనాలు.అందుకు మంత్రాలు తానూ హేమా మాట్లాడ బోయే ప్రణయకావ్యాకు.తనకు వచ్చే పురోడాశము హేమ మెత్తటిగులాబీ మొగ్గల పెదవుల్లోని సుధారసము.ఈ రాజసూయానికి బలి త్యాగతి శిశు పాలుడు.ఉడికిపోయే దుర్యోధనుడు కల్పమూర్తి. సాయంకాలం కలియుగ మన్మదునిలా వేషం కై సేసుకొని,ఒళ్ళు చెక్కు చేదరకుండా ఉండాలి ట్రిప్లికాసు నుండి టాక్సీ వేసుకొని తిర్ద్ సైదా పేట చేరాడు.సాయంకాలం ఆరు గంటలకు హేమ తన కారుతో చక్కావచ్చి,తలుపు తెరచి తీర్ధమిత్రుని ఎక్కమని,మళ్ళికారు నడుపు కొని చెంగల్పట్టు దారిపట్టింది.అతి వేగంగా నడుపుకుంటూ పదిహేనుమైళ్ళు వెళ్ళి కారు ఆపు చేసి దిగించి తిర్ధమిత్రుడూ దిగాడు."తిర్ద్!నువ్వూ,నేనూ కలసి బొంబాయి ప్రయాణం.నేను నీతో రావడం నా ఆవేదన చల్లార్చి కొనడానికే.అయినా నాకు ఇష్టంవస్తే,నేను నీకు పెళ్లితంతులేని భార్యను అవుతాను.అదీ బొంబాయిలో,అక్కడయినా నా ఇష్టం వస్తేనే,ఆ విషయంలో నేనేమీ నిశ్చయానికి రాలేదు నేను నన్ను నువ్వు ముట్టుకోవచ్చు నన్నదాకా ముట్టటనికి వల్లకాదు.ఇవి నా షరతులు.ఇష్టం అయితే సరేఅను,లేకపోతే,తిరిగి వెళ్ళిపోదాం"అన్నది.
   తీర్ధ:నాకు పరమయిష్టం.ఓహో!నా తపస్సు ఎన్నాళ్ళకు ఫలించింది!ఈలోగా ఒక్కసారి...
   హేమ:ఛట్!వెదవ మొగతనం,నువ్వునూ!నే నన్నమాటలు అతి నిశ్చయంతో అన్నవి.
   తీర్ధ:సరే,సరే!కాని ఓ స్వప్నరాణి!ఓ మహొజ్వల...
   హేమ:పుల్,నోరుముయ్యి.నాకు ఈ ఉప్పచప్పని,దొంగ మాటలు అక్కర లేదు.వెనక్కుపోదాం.
   అంటూ హేమ కారు ఎక్కింది.తీర్ధమిత్రునికి వేయి మదుర కలశాలు ఆతని తలపై దేవతలు గుమ్మరించినట్లయింది.ఏలా కారుమీద కూర్చున్నాడో ఆమెకు దగ్గరగా జరిగి అంటుతూ కూర్చున్నాడు."తిర్ద్,దూరంగా జరుగు.నా మాటలు వేళాకోళాలు కాదు"అని పళ్ళు బిగించి హేమ అన్నది.కధ అడ్డంగా తిరుగుతుందే మోనని తీర్ధమిత్రుడు దూరంగా జరిగి కూర్చున్నాడు.