పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బోతున్నాననీ,ఆ విషయం జాగ్రత్తగా తన తల్లిదండ్రులతో చెప్పా వలసిందనీ లోకాన్ని హేమ కోరిందట!లోకం వెంటనే ఆ టాక్సీమిద మా ఇంటికి వచ్చింది.నేనూ,లోకం,నీ కోసం పరుగెత్తుకొని వచ్చాం.

       త్యాగతి:లోకం ఏదీ?
       కల్ప:నా కారులో ఉంది.
   శ్రీనాధ మూర్తి ఒకసారి కళ్ళు మూసుకొని కైలా సేశ్వరుని ధ్యానించాడు.ఒకసారి శకుంతలను ధ్యానించాడు."కల్ప మూర్తీ!నీ కారులో గుంత కల్లు వరకూ వెళ్ళి వచ్చేందుకు పెట్రోలు సిద్ధంచేయి.లోకేశ్వరీ!ఇంటి దగ్గరకు పోయి మా అత్తగారితో  మామగారితో మనం అంతా తిరుపతి కారు మీద వెళ్ళివద్దామని బయలుదేరామని చెప్పు.పోదాం పద.నేనూ వస్తున్నాను.నీ దగ్గర డబ్బు ఉంటే అంతా వేసుకురా.నా దగ్గర రెండు వందలు న్నాయి.అవి పట్టుకువస్తున్నాను"అని చెప్పుతూ లోపలకు పరుగెత్తాడు.
                                                                                                                  31
   ఆ రాత్రి బొంబాయి మెయిలు బయలు దేరడం 6-45గంటలకు,అందుకై హేమ పగలు పదిగంటల నుండి చల్లగా సర్దుకుంటూ ఉంది.తన పేరునబ్యాంక్ ఉన్న పన్నెండు వేలలో డిపాజిట్లు రెండూ నాలుగు వేలకూ మూడు వేలకూ ఉన్నాయి.తక్కిన అయిదువేలూ తాను తీసివేసుకుంది.ఇంటి దగ్గిర తన స్వంత ఇనుప పెట్టెలో పదమూడు వందల రూపాయలున్నాయి.ఆ పదమూడు వందలలో,నాల్గువందల రూపాయలు తీర్ధ మిత్రుని కిచ్చి బొంబాయికి రెండు మొదటి తరగతి టికెట్లుకొని రిజర్వు చేయించ మంది తీర్ధ మిత్రునికి ఇచ్చిన నాలుగువందలు పోను తక్కిన తొమ్మిది వందలూ,ఇంకా అయిదు వందలతో తోలు పెట్టెలు, పరుపుచుట్ట, హోల్డ్ఆల్, దిండ్లు, దుప్పట్లు, తువాళ్ళు ,చీరలు, జంపర్లు, లోని లాగులు, బాడీలు, జేబు రుమాళ్ళు వగైరా సామానెంతో కొంది.అవన్నీ తీర్ధమిత్రునే జాగ్రత్త చేయమంది.జంపరు వగైరాలు మంగళవారమే అర్జెంటుగా కుట్టేటు ఏర్పాటుచేసింది.  ఇంటి దగ్గిర నుంచి ఒక వస్తువు తీసుకొని రాదలచుకోలేదు.అనుమానాస్పదమౌతుందణి ఆమె భయం. అప్పటికి కొన్న చీరలు,జంపర్లు,అలంకారపు పెట్టెలు,చిన్నవి అన్నీ నెమ్మదిగా తీర్ధమిత్రుడికి చేరవేసింది.
                                                                                                              *    *    *
   ఆదివారం సాయంకాలం తాను తీర్ధ మిత్రునితో చెప్పినట్లు గా,హేమ బయలు దేరి అతణి సైదా పేట రైలుగేటుదగ్గర కలుసుకొని,చెంగల్పట్టు దారి పట్టించింది తన కారును.
తీర్ధమిత్రుడు హేమ తనకా కబురు చెప్పినప్పటినుంచీ ఈ లోకంలో లేడు.ఏవో మహామన్మద లోకంలో ఉన్నాడు.అతడు ఎగర వేసిన చక్రవాత్స్యాయన పతాక ఆకాశంలో కామదేవ లోకానికి సమీపం వరకూ విజృంభించి