పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆలోచించి హేమను నేను మంచి అనుకున్న దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను.ప్రయత్నం నెగ్గదేమో అన్న నిరాశ నాకు లేకపోలేదు.

   రంగ:ఏమోరా నాన్నా,నాకు మీ పద్ధతులు ఏమీ నచ్చవు.ఏమిటో అంటారు.ఏమో చేస్తారు.ఏమి అనబోతారో,ఏమి చేయబోతారో,మాకు ఏమి ఆలోచించినా మనస్సుకు తట్టనే తట్టదు.
   శ్రీనాధ:అమ్మా,నేను ఏమి చెప్పలేను కైలా సేశ్వరుణి ధ్యానించు కుంటూ కూర్చుంటాను.ఆ తరువాత ఆయన ఇచ్చ.
   అని శ్రీనాధ మూర్తి భోజనము చేశాడు.మూడు రోజులు ఎడతెగని ప్రార్ధన చేసుకుంటూ ఉండేవారు.బుద్ధ మూర్తి వెనుకవున్న గదిలోనికి పోయి తలుపు వేసుకొని గంటలు ఉండేవాడు.
   హేమ తనపై కోపగించి అతి వేగంతో వెళ్ళిణ రోజు ఆదివారం.ఆ ఆదివారం తర్వాత బుధవారం రోజున,చటుక్కున కల్పమూర్తి కారు వేసుకుని ఎనిమిది గంటలకు త్యాగతి ఇంటికి రహస్య విషయం మాట్లాడాలి"అన్నాడు.
   త్యాగతి:"ఏమిటిది?"అని అడుగుతూ కల్పమూర్తితో వరండా లోనికి వచ్చాడు.
   కల్ప హేమను తీర్ధమిత్రుడు ఎక్కడికో తీసుకుపోయాడు.
   త్యాగతి గుండె ఆగిపోయింది."ఆఁ!"అన్నాడు అతని మెదడులో మహారౌద్రాగ్నిజ్వాల లోక్కసారి గుప్పుమన్నాయి.
   ఆ అత్యంత విషాద సంఘటన సమయంలోనూ భయంకర యుద్ధం ముందు ఏమీ చలించని సేనానాయ కుడిలా అతడు ఒక్క సెకండులో గంభీరశాంతి వహించాడు."ఈ  సంగతి ఎవరికి  తెలియదు గదా?"
   కల్ప:ఎవ్వరికి!
   త్యాగ:మీకెవరు చెప్పారు?
   కల్ప:తీర్ధమిత్రునీ హేమనూ తీసుకువెళ్ళిన టాక్సీమనిషి,వినాయక రావు గారి డైవరూ కలసి మా ఇంటికి వచ్చారు.
   త్యాగతి:బొంబాయి మెయిలు వెళ్ళినట్లు?
   కల్ప:బొంబాయి మెయిలు ఎక్కారట!
   త్యాగతి:ఎలా తెలిసిందీ?
   కల్ప:టాక్సీవాడికి ఏదో అనుమానం వేసి,సెంట్రల్ స్టేషనులో వాళ్లిద్దరూ సామాను పట్టించు కొని లోనికి వెడుతూంటే వాళ్లిద్దరూ చూడ కుండా లోపలివెళ్ళి బొంబాయి మెయిలులో ఎక్కుతుండగా చూశాడట.ఆ వెంటనే వాడు మన హేమగారి డైవరింటికి వెళ్ళి తన అనుమానం చెప్పాడట.వాళ్ళిద్దరూ హేమగారి ఇంటికి వెళ్ళి అక్కడ లోకాన్నికనుక్కుంటే,లోకం వెళ్ళి హేమ గదిలో చూస్తే,హేమ గదిలో బల్ల మిద లోకం పేరుతో ఓ కవరుందట.ఆ కవరులో తాను తీర్ధ మిత్రుని గాంధర్వం చేసుకో