పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతనికి మిన్నంటిన విచారము వచ్చింది. తాను చేసిన పనులన్నీ తేలివితక్కువవే. మదరాసులో మరదలిని తన భార్యగా చేసుకోనదానికి ఈ ఇల్లు కట్టించుకొడం, ఆ ఇల్లు కొనడం ఇక్కడే తాను శాశ్వతంగా ఉండమని ఎంచుకున్నాడు కాబోలు? మనుష్యులు మూర్ఖత్వ ప్రవాహం అర్ధంలేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. తాను క్తెలాసానంద భారతి స్వామిజి గురు పాదులను ఆశ్రయించి ఈ బాధలన్నింటిని తప్పించుకోవలసినదే! ఎందుకు కి వ్యర్ధప్రయత్నం ? ఎందుకీ కతలు? ఎందుకు స్వామి ఈ ఆయంపటాటోపం?

     నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళల్లోనీరు తిరిగింది. తలుపు తీసుకొని బౌద్ద చ్తేత్యంలో ప్రవేశించాడు. బౌద్దమూర్తి ఎదుటసమాలింగిత భూతలు డయ్యాడు. లేచి కూర్చున్నాడు. పద్మాసనం వేసుకొని మనస్సు కుదుట పరచుకోడానికి ప్రయత్నం  చేశాడు. అతని మనస్సు తన ఇష్టంవచ్చింట్లే పోయింది. తన్ను గోముఖవ్యాఘ్రాంగా పోల్చింది. అందులో  అంతా సత్యం. తన  ఈడుకు ఆ పసిబిడ్డను వివాహం చేసుకోటానికి  ప్రయత్నం చేయడం ఏమిటి? పోరుషులంత హినజంతువులు ఈసృష్టిలో  లేవు! హేమ చెప్పిన మాటలన్నీ నిజం. తన శకుంతల పోలికతో ఉన్న ఈ బాలిక  దేహం వాంచించాడు. హేమ వ్యక్తిత్వాన్ని వాంచించాడు. ఎందుకు తనకి  అర్జున విషాదయోగం? చాలు తన శృంగార నాయకత్వం. అంతా చాలు! చాలు భగవంతుడా చాలు !
   అత డక్కడనుండి లేచి, తల్లిదగ్గరకువెళ్ళి, "అమ్మా, మనం వెంటనే హరిద్వారం పోవాలి! నా మనస్సులో  నేను భరింపరాని బాధ తయారయింది. గురుదేవులను  చూడకపోతే  నాకు ప్రాణాలు నిలువవు. ఎల్లుండి ఉదయం ఇద్దరం కలసి స్వామిజి దగ్గరకు ప్రయాణం !" అన్నాడు.
   రంగనాయకమ్మగారు తెల్లబోయి కొడుకుని చూచి, "నాన్నా స్వామిజి శిష్యరికం స్వామిజీవా రిచ్చిన ఆదేశాలను పరిపాలించటంలో లేదు కాబోలు. ఇంత మనస్సును లోబరచుకోలేనివాద వయ్యవేమిటిరా నాన్నా?" అన్నాది.
   శ్రీ నాథమూర్తిసిగ్గుతో మోము వంచుకొన్నాడు. "ఎదో మనస్సులో ఆవేదనతో అన్నాను.  నాకు  అన్నం పెడ్తావా?" 
   రంగ:మడికట్టుకురారా! హేమ వచ్చినట్లుంది. నాతో చెప్పు కుండానే  వెళ్ళిపోయిందేమిటిరా?
   శ్రీనాథ: హేమ వచ్చింది. నాతో మాట్లాడుతూ కూర్చుంది. ఎదో కాస్త వాదనవచ్చి కోపంతో వెళ్ళిపోయింది.
   రంగ: దానితో ని కాస్తమానం వాదనెందుకురా నాన్నా!                                                                                                                             
           
               

శ్రీనాధ:అమ్మా,హేమ ఈనాటిపిల్ల.ఎం.ఏ.కూడా!ప్రతి విషయమూ వాదించి ఒప్పించాలి.వాళ్ళ మనోగతులు వేరు.అందుకని ప్రతి విషయం