పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యాయి! ర్తెలు కదలదేమి? ఏడి .... ఈపుల్ .... ఏ పనికి వెళ్ళినా ....డాబుల ఆడపిల్ల ..... కులుకులు .... అతి తెలివి? ఏమిటి ఉక్క పోత? ఏప్రిల్ ఆఖరి వారంలోనే....త్యాగతి.....ఏం చేస్తూ ఉంటాడు..... ఎడిశాడు! ఏడుస్తూ ఉంటాడు అమ్మ !....అమ్మ ఎంత నీరసం? ఏమిటి? గడియారం గంటకో నిమిషం చొప్పన జరుగుతోందేమిటి? ఇక పది నిమిషాలుగా..... మారాయా? అమ్మయ్య ఈ లావెశాడు గార్డు గంట వచ్చాడయ్యా ఈ జిడ్డు ఓహొ తీర్ధమిత్రుడు అందంగానే ఉంటాడు! ర్తెలు కదిలింది. కదలడంతోటే ఆమె వతీ జావాకడిలా ఓ మూల కూలిపోయింది.

   తీర్ధమిత్రుడు ఫిలిప్త్పేన్స్ పట్టించిన టోజోలా ఆనందంతో ఉప్పొంగి ఆ రైలు తన కేర్పరచిన స్పెషలుబండిలా భావించుకున్నాడు. ఒహొ ఇప్పటికి ఈ మూడు ఏళ్ళ మహొత్తమ కృషి ఈనాటికి  ఫలించబోతోంది! ఈ ప్రపంచాద్బుత సమ్మోహనాంగి తన ప్రేయసి తానూ అయిదు వేలు  పట్టుకువస్తోంది చక్కని హొటల్సు బొంబాయి తాజ్ మహల్  చాల అద్బుతంగా ఉంటుంది ఒకసారి తనలో  ఈ బాలిక  కరిగిపోతే ఇక ఎప్పడూ తనదే- తనదేనండయ్యా- ఈ కోటిపూవుల బాలిక కోటి సినిమా తారల నిధి కోటికోటిసువాసనలమూర్తి తనది ఈమె!తానే! ఒక పడకగదిలో ఇదివరదాకా ఊహించుకొన్న ఆమె సర్వాంగాలూ, ఆకులలోని గులాబిపూవు రేకలులా, ఆ పందిరిమంచంమీద నగ్నంగా ! ర్తెలు వేగంగా వెళ్ళి పోతోంది అతివేగంగా అతి  మహావేగంగా వాయువేగ విద్యుత్ వేగ కాంతివేగ ఆకాశగోళ వేగంగా వెళుతోంది. తీర్ధమిత్రుని కాంక్షలు ఊహలు ఉప్పొంగు  భావాలు వేగంగా, అతివేగంగా వెళ్ళుతున్నాయి.
   ఇంత సేపూ కుంగిపోయి కిటికిలోంచి హేమ చూస్తోంది. తీర్ధమిత్రుడు ఆమెను కబళిస్తున్నాడు. చూపులతో కోర్కెలతో  తమి మీరిన భావాలతో హేమకు దగ్గరగా చేరాడు! హేమ దగ్గరగా కూర్చున్నాడు. అతని కళ్ళు యేరు పెక్కాయి! అతని ఊర్పులు వేగవంతం అయ్యాయి.
   హేమ తీర్ధమిత్రునివ్తెపు తిరగకుండానే, "తీర్థ్! నా ఆలోచనల కేమి భగ్నం కలిగించకు. బొంబాయి వెళ్ళినా అనుమతి అయినదాకా నన్ను ముత్తుకోవద్దు. మన ఒప్పందానికి భంగం కలిగించకు" అన్నాది.
                                                        30
   హేమ కోపంతో వెళ్ళిపోయిన మరుసటిక్షణంలో త్యాగతి నిట్టూర్పు వదలినాడు.