పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జనం మనస్సంతా కుమ్ముకుంటున్న ఆలోచనలా ఉన్నారు. హృదయాలు మడుతున్నట్లు భరింపరాణి ఉక్క ! ప్రతిబండిలోనూ యుద్ద సబంధపువార్తేన స్తేనికులు,ఇంజనీర్లు కూలీలు, గుమాస్తాలు యూనిఫాం దుస్తులతో ఉన్నారు. వేల్తుతున్నదిచావుకో, విజయానికో; వాళ్ళఉత్సాహం వాళ్ళది. యుద్ధం అంతా ఒక విరనాట్యమే వారికి! వాళ్ళంతా పాటలు పాడుతున్నరు; అల్లరి చేస్తున్నారు. అక్కడక్కడ మూడవ తరగతి పెట్టెలలో మాత్రం సాధారణ యాత్రికులు స్ధలంకోసం దెబ్బలాడుకుంటున్నారు

   ఇంజను దేశ నాయకుడిలా, కదానాయకుడిలామహావేగంతో వేడుతూంది. అది ఇనపజంతువు. దాని హృదయం అగ్ని; దానిశక్తి ఆవిరి. మ్తెళ్ళు మ్తెళ్ళు ముందుకు ర్తెలుపట్టా దారిమీద ప్రసరించే దాని చూపు అఖండ కాంతివంతమ్తెన ఒకటే కన్ను అదిఏకాక్షి. లోక సంహరిమాత్రం కాదు! మహావేగంతో వెళ్తున్న బండిలో మధ్యగా ఒక మొదటి తరగతి పెట్టె ఇద్దరు మాత్రమే  కూర్చునే  గది అది. అందులో  ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒకటే  మెత్తటి పరుపున్న  సిటు. ప్తెన ఒక సిటు ఉంది. అలాంటి పెట్టెలలో  భార్యాభర్తలు ప్రయాణం చేస్తారు.  ఆపెట్టేలో ఈ చివర కూర్చుని హేమ! ఆ చివర కూర్చుని తీర్ధమిత్రుడు!
   హేమ ఆలోచనలు కళాతాత్రో, తుపానో, సుడిగుండాలో, గట్లు తెగిన వరదలతో నిండిపోయిన  చెరువో! హేమ హృదయంలో పెద్ద వాడగాలో, వడగళ్ళ వానో, కన్ను కనబడని మంచో, గజగజలాడిస్తూ గడ్డ కట్టించే చలో!
   ర్తెలు కదిలించి___మదరాసు స్టేషనులోంచి___ర్తెలు కదిలింది! అదివరదాకా ఉన్న హేమ స్ధితి___సంపూర్ణంగా  మారిపోయింది. ఎదో ద్తేర్యంతో___నిశ్చయ___దృడనిశ్చయ హృదయంతో వచ్చి ర్తెలు ఎక్కింది, ర్తెలు ఎక్కటం టక టకమని ఎత్తుమడమల పాదరక్షలు చప్పుడు చేసుకుంటూ వచ్చి ___ఎక్కింది.....ఎవరో మహారాణిలా వచ్చి ఎక్కింది....ఎవరో పెద్ద ఉద్యోగాస్దురాలులా ఎక్కింది. తీర్ధమిత్రుడు....భార్య వెంటవచ్చే భార్తలా....ఉండాలని ....ప్రయత్నించాడు. స్త్రీ దళాల  నాయకురాలివెంట ఆర్దర్లిలా__ అయిఊరుకున్నాడు.... పెద్దప్రభుత్వోద్యోగస్దురాలివెంట___గుమస్తాలా__అయి ఊరుకున్నాడు.                                                                                                                           
           
               

"తీర్ద్, అన్ని ఇంగ్లీషు .... తెలుగు పేపర్లు ....ఇన్ని వార....మాస ....పత్రికలు పట్టుకురా" అని హేమ పర్సులోంచి ఇన్ని పదిరూపాయల నోట్లు అతని చేతులలో పెట్టింది.

   "ఇదిగో" అన్నాడు. హిగిన్ బాథమ్స్ దగ్గరకు  పరుగెత్తాడు.
   అందరూ ఆమెను చూచేవారే! ఒహొ ఎవరి మహారాణి అనుకున్నారు. వచ్చే స్తేనికుడు వెళ్ళే స్తేనికుడు ఆ పెట్టలోకి  చూడడమే !
   విధ్యుచ్చామరాలు ఎంతగాలి విసురుతున్నా ఆమెలో ఎదో వేడి మూలాన.... చెమటలు....చెమటలు! ఆమెచిన్న జేబురుమాళ్ళు .....ఎనిమిది తడిసిపో