పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తేల్చుకొనిపోయాయి. ఆ ఉత్తరాలు మూడూ తీసుకుని లోకేశ్వరి త్యాగతికడకు పోయింది. అతనిలో తన హృదయం నిశాపతిపై లగ్నమ్తె ఉన్న విషయమూ, ఒకనాడు తనకేమి ఆశలేకపోవుటా, తనకాశ గలిగిన విషయమూ అతనితో చెప్పుకొన్నది.

   త్యాగతి: లోకేశ్వరి! నువ్వు నిశాపతికి ఉత్తరం రాయి. ని హృదయము నీవు విప్పి రాయి, నేనూ రాస్తాను. అతను నువ్వంటే దేవతగా భావిస్తున్నాడు. కాని అతన్ని అర్ధంచేసుకోలేవెమోనని భయపడుతున్నాడు. మీ ఇరువురి దామ్పత్యమూ నాకు పరమ ఇష్టము.
   ఈ చరిత్ర అంతా లోకేశ్వరి హృదయంలో సినిమా చిత్రంలా ప్రసరించిపోయినది. ఇంక హేమకు కోపమెందుకు కలగాలి. ఈ విషయము త్యాగాతితో చెప్పిన మరునాడే  వినాయకరావుగారికి, వెంకట రామరాజ్య లక్ష్మమ్మగారికి తాను మనవిచేసింది. వా రేంతో సంతోషించి, లోకేశ్వరి వివాహము తమ ఇంటనే  మహావ్తె భావంగా తాముజారిపించాలనుకుకొంటున్న కోర్కె, నేటికి ఈడేరె సమయం వచ్చినందుకు తమ ఆనందానికి మితిలేదన్నారు. ఆ విషయమూ లోకేశ్వరి నిశాపతికి రాసింది.
   "మీరు రాసిన మూడుత్తరాలూ నాకు  భగవద్గిత, రామాయణం, భారతం వంటివి! మీ ఉత్తరాలలో మీరు, నా జీవితంలోనూ నేను పెన్ని దానం అనుకునే  మార్పు రాగలదనే  సూచన చేసినారు. నా మనస్సు, ప్రాణం జీవితం మీకు ఇదివరకే లగ్నమ్తె ఉన్నవి. ఈ మాటలు త్యాగతి గారు నేను వ్రాయాలని చెప్పడంచేత సిగ్గువిడిచే రాస్తున్నా. మీరు నాకు దేవతలు. మీ బొమ్మను నేనూ విడిగా తీయించుకొని, పూజిస్తున్నా !....." అలా అలా ఏమేమిటో తాను రాసింది. ఆ ఉత్తరం రాస్తుంటే  తనకు చెమటలు పోసినాయి.
   పెట్టెలో దాచుకొన్న నిశాపతి బొమ్మను తిసి కళ్ళకద్దుకొని మళ్ళి పెట్టెలో పెట్టుకున్నది లోకేశ్వరి. కల్పమూర్తి ఇంటికి వెళ్ళిపోయినాడు, త్యాగతి మాటలు  లోకేశ్వరికి కోటి శక్తులు ప్రసాదించినవి. ఎన్ని ఉత్తరాలో చింపి, చివరకు ఆ ఉత్తరం  రాసింది. ఆదివరకే త్యాగతి ఉత్తరం నిశాపతికి అందింది. లోకేశ్వరి ఉత్తరం అందగానే తంతినిచ్చాడు.
                                                                                                               29
   మద్రాసు నుండి బొంబాయి మెయిలు అతివేగంతో వెళ్ళిపోతున్నది. ఆ వేసవికాలంలో నక్షత్రాలూ, ఇంజను పొగగొట్టం నుంచి వచ్సిన నిప్ప కణాలూ కలసిపోతున్నాయి! ఆ బందే నిప్పకణాలను ఆకాశంవరకూ ఎగజిమ్ముతోంది. ఆ కణాలు నక్షత్రాల్తే ఆకాశంలో నిలిచిపోతున్నాయి కాబోలు! పట్టాలప్తెన వెడుతున్నా  బండి ఎల్లా వెళ్ళుతోందో, వెనక్కే వేడుతోందో, ముందుకో అనుకుంటారు యాత్రికులు. బండి నిండా అతి ఒత్తిడిగా