పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అప్పుడు నన్ను రక్షించింది నువ్వూ; త్యాగతీని. అంటే, నువ్వు ఓ రాత్రి నా సంగీత కచ్చేరి యైన తర్వాత మనం అందరమూ హేమగారి ఇంటికి వస్తూన్నప్పుడు నాతో, నిశాపతీ! నీ గొంతుక, నీ దివ్యసంగీతమూ భగవంతునికి ఒక మహానివేదన. జన్మలో ఈ రెండూ చాలు. ఇంక ఏవిలేకపోయినా జన్మ ఎత్తినందుకు సార్థకత దొరికినట్లే అన్నావు. ఆ ముక్కలు కోటి మెరుముల కాంతితో నా జన్మను వెలిగిస్తున్నాను.

   నేను నందిపర్వతాలకు పారిపోయి వచ్చేటప్పుడు  త్యాగతి నన్ను రైలు  ఎక్కిస్తూ, నిశాపతీ! ప్రపంచంలో భౌతికవాంఛలు తీరినా ఒకటే, తీరకపోయినా ఒకటే. భౌతికవాంఛతో మనోవాంఛ కలిసిపోయినప్పుడు ఆ  గాఢవాంఛ తీరలేదన్న బాధ ఎక్కువ అవుతుంది. అది తీరకపోయినంత మాత్రానమనం పశువులమై__ అంటే భౌతికవాంఛ కోరిన పశువు అది తీరలేదని బెంగపెట్టుకొని చచ్చిపోదు. చూడూ, ఆ వాంఛను మర్చిపోవాలి. మనం మరువలేనిది భౌతిక, మానసిక, ఆధ్యాత్మికములు సంగమించిన  వాంఛనే  అన్నాడు. ఆ మాటలు నాకు మొదట అర్థం  అయ్యాయికావు. తర్వాత ఆ మాటలే నాకు  పదేపదే జ్ఞాపకం వచ్చాయి. జ్ఞానవంతుణ్ణయి, దేశాలు తిరిగాను. అంతకన్న అంతకన్న హేమ నాకు  సహోదరి అన్న భావం  ఎక్కువైంది. 

లోకేశ్వరిదేవి ! ఈ మూర్ఖుణ్ణి మరచిపోకు. నీకు నా సంగీతము ప్తె ఉన్న గాడాభిమానాన్ని ఈ దీనునిమీద కూడా కాస్త ప్రసరించు

త్యాగాతిని, కల్పమూర్తిని, హేమనూ, అత్తగారిని, మామగారిని అందరిని అడిగినాను.


                                                                                       ఇట్లు నీ ప్రియమిత్రుడు,
                                                                                                 నిశాపతి
                                                                                                                         
           
               

ఆ ఉత్తారాన్ని లోకేశ్వరి కళ్ళకద్దుకొని, ముద్దుపెట్టుకొని హృదయం కడ దాచుకోంది. ఈ ఉత్తరం వచ్చిన రెండు నెలలకు నిశాపతి కడ నుండి రెండో ఉత్తరం బొంబాయి నుండి వచ్చింది. ఆ ఉత్తరంలో "లోకేశ్వరిదేవి! నీతో ఎన్నో చెప్పాలి. ని జీవితం ఉత్తమం ____ అది ముందు ఎలా మారుతుందో? ఎలా మారినా నీవు మారవు. హేమకుసుమ దేవి చాలా గొప్ప వ్యక్తి అవుతుంది" అన్నమాటలు లోకేశ్వరి హృదయాన్ని గాలివాన నాటిసముద్ర కెరటాలలో ఎగిరించి పడవేశాయి. ఆమె కేదో సంతోషము, ఎదో భయమూ రెండూ కలిగాయి.

   1941 మార్చినెలలో నిశాపతి డిల్లినుంచి మూడవ ఉత్తరము లోకేశ్వారికి వ్రాసినాడు.  అందులో,  "లోకేశ్వరి! నా కి నెలలన్నీ నీవే సర్వ కాలమూ జ్ఞాపకం  వస్తున్నావు. నీ ఉత్తరాలు ఒక మ్తెసురు  చండుగా పెట్టేలో పెట్టుకున్నా. మనం అందరమ కలసి  హేమసుందరిగారి  తోటలో తియించుకొన్న  ఫోటోలోంచి నీబొమ్మను వేరేదియించి బంగారు ఫ్రేములో పెట్టుకున్నా, అందుకు  నన్ను నువ్వు కోపపడకు" అన్న ముక్కలు లోకేశ్వరిని ఏలోకాలకో