పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాణం పోయినా, వేయిమంది లోకేశ్వరులను బలియిచ్చినా, నా హేమకు సూదిమొనంత కష్టం రాకూడదు. ఇదీ నా ఆవేదన. ఇంతట్లో ఏమి వచ్చిందో నిశాపతి వెళ్ళిపోయాడు. సోఫీ అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పావు.దానితో నా గుండెల్లోంచి ఒక హిమాలయ పర్వతము తీసివేసినట్లయింది.

   హేమ :  ఓహో! ఒక కథలాగే ఉంది నీ చరిత్ర. నువ్వు నన్ను  పొగడా అక్కర్లేదు. నీ ప్రేమ చరిత్ర నాకు చెప్పనూ అక్కర్లేదు. నా గుణం వాన బిందువూకాదు, మంచు బిందువూకాదు. మన రోడ్డుప్రక్క బురదగుంటలో నీటి బిందువు. నా గుణంతో సరిపోలిస్తే అది రెండుసార్లు బట్టీపట్టిన బిందువు లాంటిది. నిశాపతి పెళ్ళిచేసుకో మరి ఇంకొర్నిచేసుకో. నాకవసరంలేదు, అని అతి కోపంతో విస విస మేడమీదికి వెళ్ళిపోయింది.                                                                                                                           
           
               

ఏమిటీ విచిత్రమని లోకేశ్వరి అనుకుంది. ఎందుకు హేమకు కోపం? తానేమి చేసింది? హేమ తన హృదయాంతరాలో నిశాపతిని ఏమన్నా ప్రేమిస్తున్నదా? అయితే తాను వెంటనే హేమా నిశాపతుల జీవితంలోంచి మాయమైపోవలసినదే! ఈ తరుణంలో భగవంతుడే తనకు శక్తి ఇవ్వవలసి ఉంది. లోకేశ్వరి హేమ వెంట మేడమీదకు వెళ్ళాలా లేక వెళ్ళకుండా ఉండాలా? అని తటపటాయించింది.

   లోకేశ్వరి చామనఛాయ కలది. అయినా ముఖం స్పష్టమైన రేఖలతో మనోహరంగా ఉంటుంది. దేహరేఖలూ స్పష్టమై పూర్ణత తాల్చి  ఉంటాయి. లోకేశ్వరి స్త్రీలలో స్త్రీ. ఆమె వ్యక్తిత్వం  దర్శించిన    ఏ  పురుషుడైనా, ఉత్తమ ప్రేమభావాలల్లావుంచి, ఆబాలిక  దేహాన్ని వాంచిస్తాడు.
   లోకేశ్వరి ఆలోచించుకొని, ఆలోచించుకొని, నెమ్మదిగా మేడమీదకు వెళ్ళింది. హేమ తనమంచంమీద బోర్లగిలా పడుకొనివుంది. లోకం వెళ్ళి,  హేమా!  నీ మనస్సులోనిదంతా నాతొ చెప్పు. ఇన్నినాళ్ళ స్నేహమూ వట్టిదేనా?  ఆమెచుట్టూ చేతులువేసి ఆమెపై వాలి తన గుండెకు అదుముకొంది.
   హేమ : ఏమో లోకం! నాకు స్నేహితులు లేరు, చుట్టాలు లేరు. మొండిలా నేనొక్కదాన్నే వున్నాను.
   లోకం : అదేమిటి హేమా! నేను తీర్థమిత్రుని విషయం చెప్పలేను గాని, కల్పమూర్తీ, త్యాగతీ, సోఫీ, నేనూ నువ్వుంటే  మా ప్రాణం అర్పించడానికి సిద్దంగా ఉన్నామే!
   హేమ చటుక్కున లేచి కూర్చుంది.  ఏమిటి తీర్థమిత్రునకు వచ్చినలోటు?  అని తీవ్రంగా అడిగింది.
   లోకేశ్వరి కస్టంతోచి కొంచం చురుకుగానే,  అతడు  ఇప్పటికి రెండేళ్ళ క్రితం ఒకసారి  నన్ను  గబుక్కున కౌగిలించుకొని,  ప్రాణేశ్వరి, నువ్వు అపర రతీదేవివి; నీతోనే నా జీవితం అన్నాడు. అప్పుడు అతన్ని తీవ్రంగా అదలించి నా మొగం  చూడకన్నాను. అవమానంచేత చచ్చిపోయాడు. ఈ మధ్య ఆరు నెలల క్రితం ఒకసారి  లోకం!  శృంగారాదిదేవీ! నా కోర్కె తీర్చకపోతే,