పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టర్కీతువాలు వల్లెవాటు వేసుకొని తన దబ్బపండుఛాయకు మరింత కాంతి వచ్చేటట్టుగా హేమ దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు.

    ఈ సాయంకాలం నీతో  మాట్లాడవలసిన అంశాలు చాలా ఉన్నాయి. నువ్వూ నేనూ మాత్రం  మాట్లాడాలి. నేను నీకోసం నా చిన్నకారు మీద వస్తాను. మనం తిన్నగా చెంగల్పట్టుపోయేదారిలో కొంతవరకు పోయి ఎక్కడో ఆగి  విషయాలన్నీ మాట్లాడుకోవాలి. నువ్వు  సైదా పేట రైలు గేటు దగ్గర నిల్చొని వుండు అని హేమ అతనికి మాత్రం  వినబడేటట్లు చెప్పి,  కల్పమూర్తీ! మా యింటికి వెడదాము. నీ భోజనము అయిందా? అని అడిగింది.
   కల్పమూర్తి : ఇంకా చేయలేదు హేమా!
   హేమ : రా నాతో! మా యింట్లో భోజనం  చేద్దుగాని.
   తమ తమ  కారులమీద వారిద్దరూ హేమ యింటికి చేరారు.
                                                                                                                           
           
               

హేమ గదులన్నీ మేడమీద ఉన్నాయి. ఒక గది హేమ చదువుకోనేది. ఒకటి హేమ స్నేహితురాళ్ళు కూర్చొనేది. ఒకటి హేమ గ్రంథాలయం. ఒకటి హేమ అలంకరణలగది. ఒకటి హేమ పడకగది. ఆ గదులన్నీ హేమ ఎంతో అందంగా అలంకరించుకొంది. దక్షిణవైపున ఆమె పడకగది, అలంకరణ గదీ వున్నాయి. తూర్పున అతిథి మందిరము వుంది. మధ్యహాలు రేడియో గది. ఆమె స్నానాలగదికి అలంకరణ గదిలోంచి దారి వుంది. పడకగది లోనుండి అలంకరణ గదిలోనికి దారి వుంది.

   హేమ తల్లిదండ్రులు గదులు, లోకేశ్వరిగది, పూజా మందిరము, అతిథి మందిరము, సేవకుల గది, గ్రంథాలయము గది, అన్నీ క్రిందనే వున్నాయి. హేమ మేడచుట్టూ సర్వ  పుష్పాలచెట్లు, కొబ్బరి, దానిమ్మ, మామిడి, సపోటా, దబ్బ, నిమ్మ, జామచెట్లు, ద్రాక్షపందిళ్ళూ వున్నాయి. తోటంతా రెండెకరాల వైశాల్యం. గులాబి జాతులు, చేమంతులు, మల్లి, జాజిజాతులు, మాధవి, మాలతీ లతాకుంజాలు, కనకాంబర, కుసుమాంబర, నీలాంబర జాతులు ఆ తోటంతా  విలసిల్లుతున్నాయి. కొబ్బరి చెట్లు ఎప్పుడూ గెలలతో నిండివుంటాయి.  ఆంధ్ర మామిళ్ళలో జహంగీరు, నాజూకుపసంద్, ఇమాంపసంద్, పంచదార కలశ, చిన్నరసం, చెరకురసం మొదలయిన జాతులున్నాయి.
                                                                                                                 27
   హేమ, కల్పమూర్తీ భోజనం చేశారు. లోకేశ్వరి అప్పటికప్పుడే భోజనంచేసి తన గదిలో  చదువుకుంటుంన్నది. వీళ్ళిద్దరూ భోజనముచేసి, హాలులోకి వచ్చేసరికి యింతలో తంతి వార్తాహరుండొకడు.  లోకేశ్వరీదేవీ, శ్రీ వినాయకరావుగారింట్లో  అన్న  తంతివార్తను కొనివచ్చాడు.
   హేమ,  లోకం! నీకేదో తంతి వచ్చిందే అని కేక వేసింది. లోకేశ్వరి గబగబ పరుగెత్తుకొని వచ్చి, వణుకుతూ, ఆ తంతి కవరు తీసుకొని, లోపలికి పరుగెత్తుకొని వెళ్ళి, కవరువిప్పి వణుకుతూనే చదువుకొంది.