పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెళ్ళేసరికి కల్పమూర్తి కారు అక్కడ ఉన్నది. హేమ ఆ కారును చూడలేదు. డ్రైవర్ను తీర్థమిత్రుడుగారున్నారేమో చూడమన్నది. ఆ రోజు ఆదివారం కాబట్టి తీర్థమిత్రుడు ఇంటి దగ్గరే ఉంటాడని ఆమెకు తెలుసును.

   డ్రైవరు  వెళ్ళగానే  అతని వెంట తీర్థమిత్రుడు ఉరుక్కుంటూ కారు దగ్గిరకు వచ్చినాడు. అతని వెంటనే కల్పమూర్తి ఇవతలికి పరుగెత్తుకొని వచ్చినాడు.
   తీర్థ : హేమా! ఏమిటి  అల్లా ఉన్నావు?
   కల్ప : హేమా! ఒంట్లో జబ్బుగా ఉందా?
   తీర్థమిత్రుడు  హేమవైపు తీక్షణంగా చూచాడు. వేటాడేపులికి, ఎదుట వున్న హరిణహృదయం పూర్తిగా అవగతం అవుతుంది. అతనికి  హేమ హృదయం  అంతా  ఒక్క నిమిషంలో అర్ధమైంది. తన స్నేహంలో  దాగివున్న మహాద్భుతశక్తులన్నీ ఉపయోగించి కూడా హేమను  లొంగదీయ లేకపోయాడు. ఈవరకు .  ప్రపంచాద్భుత సుందరీ అయిన ఆ బాలికను  నిదానంగా సర్వశక్తులూ ఉపయోగించి ఓడించాలి. ఈ బాలిక మనస్తత్వం అనేక వర్ణాల కలయిక. అనేక పరిమళాల కూడిక, అనేక రేఖల పొందిక!  ఈ నిధిని పొందడానికి ఎంతకాలం తపస్సు చేస్తే యేమి? వివిధ సిద్ధులను సముపార్జించటానికి తమ తలలను  బలియిచ్చిన మహాయోగులు లేరా? అప్పటికీ అయిదారుసారులు తానూ కొంత  కొంత ముందుకుసాగాడు. ఆ పురోగమనం  అంతటితో  ఆగిపోవడమే కాకుండా  మళ్ళీ వెనకటికన్న వెనక్కు వెళ్ళవలసి వచ్చింది. ఒకసారి  ఆమెను కౌగిలించుకున్నంత పనిచేశాడు. ఒకసారి ఆమెను చిన్నబిడ్డలా ఎత్తి  ఒక చిన్న కాల్వదాటాడు. ఒకసారి ఆమెను  తోటలో పెదవులమీదనే చుంబించబోయాడు. అప్పుడామెకు విపరీతమైన కోపం వచ్చింది.
   ఆ మర్నాడు  తానామే నొంటిగా కలుసుకొన్నప్పుడు ఆమె బిగుసుకు పోయి  మొగము చిట్లించుకొని  తీర్థ్! నువ్వు, నన్ను  కామోద్దేశంతో ముట్టుకోవడం ఏమీ ఇష్టంలేదు. అది  పెద్దపాపం  అని నేను  ఇలా  చెప్పడంకాదు. నా మనస్సు అలాంటి పనులవల్ల బాధపడుతోంది. ఇక  ముందు  నీకూనాకూ స్నేహం ఉండాలంటే  ఏ విధంగానూ నన్ను ముట్టుకొనడానికి ప్రయత్నించకు. నిన్న  నీ వర్తనం  నాకు చాలా మనోవైకల్యం కలిగించింది. నేను నా నోరు డెట్టాల్ నీటితో కడుక్కోవలసి వచ్చింది. నీవే ఇంకా  ఈలాంటి  వెకిలితనం  కనబరిస్తే, నువ్వూ మా ఇంటికి రావద్దు, నీ మొహం నాకు కనుబరచవద్దు. నాకు  ఇష్టమయితే నేనే  నిన్ను వెదకికొంటూ వస్తాను అని అన్న ముక్కలు తీర్థమిత్రుని బ్రతుకునకు మహత్తరమైన అవమానం అయినాయి. అప్పటినుండీ తీర్థమిత్రుడు హేమను ముట్టుకోలేదు.
   ఇప్పుడు హేమను చూడగానే తీర్థమిత్రునికి ఇదే తనకు ప్రసాదించబడిన దివ్య సమయము అని తోచింది. ఈ ఆలోచనకు  అంతా అతని మనస్సులో రెండు చిటికెలకాలం పట్టింది. అతడు నీలిపట్టుతాబితా కట్టుకొని ఒక చక్కని