పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డంలో అసమానప్రజ్ఞా సంకల్పమూర్తి అట. అందుకని 'కల్పమూర్తి' అయినాడట. జానకిరామమూర్తి నారీ తీర్థయాత్రాపథికుడట. అందుకని అతడు ' తీర్థమిత్రు'డట. ఇంతలో నిశాపతి స్నేహం సంభవించింది హేమకు.

   జగపతిరావు స్వచ్చమైన శుక్ల యజుర్వేది బ్రాహ్మణుడు. ఇంటిపేరు కొప్పర్తివారు. సన్నంగా  పొడుగ్గా ఉంటాడు. అతని నలుపు అమావాస్య చీకటి! పాతాళలోకం! మైనపుగోరువంక , కోకిల! ఆ కోకిలా అతనిపాట తీయదనాల రాశి ! మైనపు గోరివంక గొంతులా అతని కంఠం సర్వ శ్రుతులూ ప్రోదుచేసుకొంది! పాతాళ లోకంలోని నాగకన్యల పాటలా అతని  రాగాలలో సర్వసమ్మోహాలూ కూర్చుంది. అమావాస్య నిశిలోని సముద్రంహోరులా అతని గాంధర్వాన  ఎవ్వరూ ఊహింపలేని లోతులున్నాయి.
   హేమ బి. ఏ. ఆనర్సు ప్రథమ పరీక్ష అయిన  వేసవికాలంలో  గోక్లే హాలులో జరిగిన  జగపతిరాయ సంగీత  సభకు హాజరయింది. అతని పాటలోని  మాధుర్యం ఆమెను ఆనందమూర్చలోముంచింది. ఇంకేముందీ, హేమే కోరి అతని స్నేహం వాంచించింది. హేమను నిశాపతి చూచాడు. అతని  కంఠంలోని సంగీతం  ఎడారిలో ఇంకినట్లయింది. ఆమె సౌందర్య పరమస్వచ్ఛత దర్శించాడు. అతని గొంతులో  వేయివేల మాధుర్యాలు వరదల పొంగుల్లోపలే పరవళ్ళేత్తుకు ప్రవహించి వచ్చాయి.
   జగపతిరావు సంగీత చరిత్ర సుందరీ  విజయ పరంపరే!  అతని గాంధర్వ మాధుర్యమత్తతలో ఎందరో వివిధ దేశాల  సుందరులాతని హృదయంపై వాలిపోయారు. అతనికి  అంతగా విషయాసక్తి  లేదు. సుందరులు తనచుట్టూ తేనెటీగలలా ముసరడమే అతడు  కోరాడు. వారిపూజ అతడు కోరాడు. ఒకరిద్దరు గాంధర్వబాలలు, వేశ్యావృత్తి పశువులాతన్ని తమభోగవాంఛలు తీర్చేటట్లు చేయగలిగారు. అంతే, కాని ఆ  ఆడ సాలీళ్ళగూడులలోంచి జగపతిరాయుడు ఎల్లాగో  తప్పించుకుపారిపోయి వచ్చాడు. అల్లాంటి జగపతి  హేమను చూడగానే ఈ బాలిక  పదివేల సితారుతీగలలోని పంచమ స్వరపుంజ మనుకొన్నాడు. ఈ బాలిక  సరస్వతీ  హస్తలీలాశుక మనుకొన్నాడు. జగపతి ఆనాటినుంచీ మదరాసే తన ముఖ్య మకాం చేసుకొన్నాడు, హేమ పకపక నవ్వుతూ  నిశాపతిరావుగారూ అని  అతన్ని పిలిచింది. అదే  అతని  పేరయి  కూర్చుంది.
                                                                                                                 26 
   
   హేమ తన కారును తిన్నగా  తీర్థమిత్రుని ఇంటికి పొమ్మని డ్రైవరుకు చెప్పి  వెనక సీటులో  కూలిపోయి కూర్చున్నది. కారు తీర్థమిత్రుని ఇంటి దగ్గరకు