పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తన రసిక మహాపాండిత్యాన్ని, ఈ బాలిక సౌందర్యము సవాలు చేస్తున్నదని అతడు భావించాడు. అంత అందగత్తె అని తాను గర్వపడే తన భార్య ఈ లేత నునుముగుద ఎదుట చాంపేనుద్రాక్షామృతమునందు తాటికల్లయిపోయిందని భావించుకున్నాడు. అంత పెద్దకళ్ళూ, అంత చక్కని మోములో గులాబీలో వాసనలా ఒదిగిపోయాయి అనుకున్నాడు. ఆమె ఆ అందం, ఒక లక్ష గులాబీలు విరిసిన తోటలోని ఉదయకాలంలా ఉంది అని అతడనుకున్నాడు. ఆమె ఆ లేతయవ్వనం మొదట పండిన నాజూకు పసందు మామిడిపళ్ళ ముక్కలు కోసి బంగారు పళ్లెన పెట్టినట్లుంది అని అతడు ఉప్పొంగి పోయాడు. ఆ క్షణం నుంచీ తీర్థమిత్రుడు అనేక కామ దేవాలయాలు మరచిపోయాడు. అవి గ్రామదేవతలు, ఇది మధుర మీనాక్షి దేవాలయం, తాను సుందరేశ్వరుణ్ణి అని కావ్యం అల్లుకున్నాడు.

                                                                                                             25
   కల్పమూర్తి ఆరువేల  నియోగివంశ రత్నాకరముక్తాఫలము. అసలు  పేరు చెన్నూరి  శ్రీనివాసరావు. అతనిది కృష్ణాజిల్లా గుడివాడ  తాలూకాలోని పామర్రు మంచి వసతిగల ఆస్తి. సాలుకు ఖరీదుల తక్కువ  రోజులలో నాలుగువేల రాబడి వచ్చేది. ఈ యుద్ధం  రోజులలో పదివేల రూపాయల రాబడి వస్తూంది. తండ్రి చిన్నతంలో పోయాడు. ఒక్కడే కొడుకు. తల్లి సుబ్బమ్మగారు,  కొడుకును చూచుకోవడంలో దుఃఖంమరచి  గుడివాడలో చదువు  చెప్పించింది. కల్పమూర్తికి  చిన్నతనాన్నుంచి ఆటలు మహా ఇష్టం. ఊలుబంతి  ఆటలో మధ్యగా  నాయకుడై అతడు నడిపే జట్టుకు ఓటమిలేదు. పుట్ బాల్ ఆటలో సెంటర్ ఫార్త్వర్డుగా తన హైస్కూల్ తరపున ఆడుతూ వుంటే, ఎ ఉన్నత పాఠశాల జట్టూ పదిమైళ్ళ దూరానికైనా రావడానికి వీలులేదు. ఒక్కసారిగా  అయిదారుగురు ప్రయివేటు మాస్టర్లు చదువు చెప్పేవారు. వారందరూ కలిసి  ఇతని విద్యానౌకను స్కూల్ ఫైనలు  రేవుకు నెట్టారు. అక్కడ  నుంచీ ఓడ కదలలేదు. ఎల్లగయితేనేం రెండేళ్లకు  ఏమి  మాయచేశారో చుట్టాలు పక్కాలు కల్పమూర్తికి ప్రపంచజ్ఞానం విద్య నేర్పి మామూలు విద్య ఆపుచేయించారు.
   మదరాసు క్రికెట్టు జట్టులోనో, టెన్నిస్ లోనో ఆడి పేరు సంపాదించాలని కల్పమూర్తి మద్రాసు కాపురం  పెట్టినాడు. క్రికెట్టులో మదరాసు జట్టులో బౌలింగులో, బంతి  కొట్టడంలో అసమాన ప్రతిభ చూపిస్తూ నాయుడు, మంకాడ్, మర్చంట్ ఇలాహి అయిపోయాడు. ఇప్పుడు యాభైకి తక్కువగాని పరుగులు చేస్తారు. ఆట పూర్తయ్యేసరికి నాల్గయిదు వికెట్లు తింటాడు.
   టెన్నిసులో ముఖ్యయోధుడు. అఖిల  భారతీయ టెన్నిస్ పందేలలో దిట్టమైనవాడుగా పేరు సంపాదించాడు. ఇలాంటి ఒక పందెం జరిగేటప్పుడు