పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తొమ్మిదేళ్ళు. పెద్దకుర్రవాడికి ఆరేళ్ళు, రెండవవాడికి మూడో ఏడు. ఈ మధ్యనే కనకలతకు నెల తప్పింది.

   తీర్థమిత్రునకు పెండ్లయినప్పుడు భార్య కాపురానికి వచ్చిన  మొదటి రోజుల్లో ఆమె  అందానికి తన ప్రాణమే అర్పించినట్లు పోయినాడు. ఆనాటి  నరసమ్మకు భర్త రూపెత్తి వచ్చిన మన్మధుడే! ఆ  రోజుల్లో భార్యా  భర్తలిద్దరూ కలిసి  నుంచుంటే చుట్టాలందరికీ ఎంతో ఆనందంగా వుండేది. 
   తన భార్య పొంకాల శరీరాన్ని ఆమె  గాఢనిద్రలో వుండగా  నెమ్మదిగా  దిగంబరినిచేసి చూసి  అతి పశుత్వగాఢకాంక్షతో ఆమెను తినేసేవాడు. భర్తయొక్క అతి పురుషత్వాన్ని చూచి కనకలత సిగ్గుపడేది. ఆమె లోపల ఆనంద పడినా, అతని  అతిపురుషత్వ విదిత్వ  కర్మాదుల కామెఅలా తన్నప్పగించుకొని ఊరుకొనేది. తీర్థమిత్రుని అతి పురుషత్వ దాహానికి పుత్తడిబొమ్మయిన భార్యా చాలలేదు. భార్యతో పొందు రెండు మూడు సంవత్సరాలాతన్ని  ఇతర ప్రపంచాన్ని కన్నెత్తి చూడనీయలేదు. అప్పటికి భార్య  తన పూర్తి సొత్తయినది. అతని పురుషత్వం ఎప్పుడామేను కోరితే___ఆ కాలం  వుదయమయ్యేది, మధ్యాహ్నం అయ్యేది, సాయంకాలం అయ్యేది. ఏ కాలమైనా___ఆమె  మాట్లాడక ఏదో పనిమీద వెళ్ళినట్లు వారి పడకగదిలోనికి పోవలసినదే! ఒక్కొక్కసారి అతని అతి పురుషత్వం ఆమెను దినానికి ఎనిమిది తొమ్మిదిసారులు  వాంఛించేది. ఆమె కిక్కురుమనకుండా  కామపు  సామానులా తన్నప్పగించుకొనేది?


అతనికామ దావాగ్నికి భార్య పాతదయి పోయినది. ఆమెకు ప్రథమ సంతానము కలిగినది కూడా. ఇంకా పనిమనుషులు, వైద్యాలయంలో దాదులు, యురేషియన్ భామలు, మింటుస్ట్రీటులోని అప్సరసలు, సముద్రపు ఒడ్డు మృత్యగ్రందులూ, ఒకరనేమిటి ఎందరో వృక్షాలై, చిన్న పొదరిండ్లయి, కంటకమహీజాలై, చిట్టిఅడవులై, మహారణ్యాలై ఆహుతి అయినారు. ఆ సమయంలో ఒక స్నేహితుని వల్ల ఈతనికీ అప్పుడు ఇంటరు పరీక్షకు చదివే హేమసుందరికీ పరిచయం కలిగింది. ఆ పరిచయం జరిగిన క్షణంలో జానకిరామమూర్తి అనే తీర్థమిత్రుని ఎదురోమ్ముపై స్త్రీ అనే దివ్యకామామృత కలశం ఎదురుగా ప్రత్యక్షం అయి మెత్తని చిగురుజొంపముల ముస్టితో ధామ్మని గుద్దినట్లయింది. ఈ కలశం వాంఛించిన అసుర నాయకులలో మహానాయకుడయ్యాడతడు. అప్పటి పదహారేళ్ళ బాల కుమార్తె అయిన హేమ అప్పుడే పాలసముద్రపు అమృతపు జిడ్డులలో నుంచి ఉద్భవించిన లక్షిబాలలా ఉంది. ఈ బాలకు తానే విష్ణువో లేక రావణాసురుడో కావాలనుకున్నాడు. జానకిరామమూర్తి. ఈ బాలకే తన రసికత్వ మహారసాల ముఖ్య శాఖాగ్ర సుందరమైన జహంగీరు పండుకావాలనుకున్నాడు.