పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏళ్ళ చిన్నదాన్నయిన నన్ను కబళిద్దామని నువ్వు చేసిన దొంగకుట్ర నాకు అర్థం కాలేదనుకున్నావు! ఇంక నీ మొగం చూడకూడదు అని త్వరత్వరగా పోయి కారులో కూర్చుంది. పోనీయ్ తీర్థమిత్రుని ఇంటికి అన్నది. డ్రైవరు తిన్నగా కారును తీర్థమిత్రుని ఇంటికి పోనిచ్చాడు.

                                                                                                              24
   తీర్థమిత్రుని ఇల్లు ట్రిప్లి కేసులో వుంది. అతడు  నల్లతంబి వీధిలో  వున్న ఒక మేడ  పైభాగం అంతా  అద్దెకు పుచ్చుకొని ఉన్నాడు. బి. ఏ. పట్టము పుచ్చుకొని తర్వాత  జి. డి. ఏ. పరీక్షలో  కూడా  నెగ్గి  చెన్నపట్నంలో ఈ కమేనీ, ఆ కంపెనీలలో  పనిచేసి, ఇప్పటికి మూడేళ్ళ నుంచీ జీవన లాల్ దయారాం కంపెనీలో ముఖ్య అకౌంటుగా చేరాడు. అతనికి రెండు వందల యాభై రూపాయల జీతం ఇస్తున్నారు.
   భార్యపేరు నరసమ్మ. ఈతడామె పేరు  బాగాలేదని కనకలత  అని పేరు పెట్టి లతా అని పిలుస్తాడు. వారిరువురకు  ముగ్గురు పిల్లలు కలిగినారు. ఇరువురు కుమారులు, ఒక కొమరిత. తీర్థమిత్రుడు పొట్టివాడు. అయిదడుగుల నాలుగంగుళాలుంటాడు. కనకలత పోతపోసిన బంగారు విగ్రహం. ఒత్తయిన ఉంగరాలు తిరిగిన జుట్టు, పిరుదులవరకూ వేలాడే  జడ. చారడేసి కళ్ళు కనుముక్కుతీరు ఆ కళ్ళకు  శృతిగా అందంగా  వుంటుంది. బంగారు శలాకలాంటి కాయశరీరం మనిషి.  ఏ హేమసుందరికో, ఏ  కాంచనమాల లాంటివారి అందాలకు తగ్గుగాని,  చక్కని చుక్క  అయిన వనిత. తీయటి గొంతుక చిన్నతనంలో సంగీతం చెప్పించారు. ఆమె  ఆక్రుతులే, ఆ పాటలే ఎప్పుడూ పాడుకుంటూ వుంటుంది. ఇరవై నాలుగేళ్ళ ఫ్రౌడాంగన అయినా  ఎప్పుడూ  పద్దెనిమిదేళ్ళ పడుచు ప్ర్రాయపు బాలికలా కనబడుతుంది. ఎక్కువగా మాట్లాడదు. కాని  ట్రిప్లి కేసులో ఎందరో తెలుగు  గృహలక్ష్ములలో తల్లోనాలుకగా మెలగుతూ వుంటుంది.
   కనకలత అనేకరకాలైన చేతికుట్లు కుడుతుంది. అనేకరకాలైన నూలు అల్లికలు, ఊలుదారం అల్లికలు అల్లుతుంది. ఆ  చుట్టుప్రక్కలవారైన అరవ బాలికలు ఆవిడ దగ్గరకు  కుట్టుపని నేర్చుకోవడానికి వస్తూవుంటారు. వీరిదగ్గరా, వారిదగ్గరా అనేక విధాలైన  పిండివంటలు నేర్చుకుంది. ఇవన్నీ  తెలియని వారికి  నేర్పుతూ వుంటుంది. చేతి కుట్టుపని  యంత్రం సంపాదించి, తన రవికలు, బాడీలు, తన  బిడ్డల చొక్కాలు, కోట్లు, లాగులు, తన భర్త షర్టులు, బనీనులు అన్నీ  అందంగా  కుడుతుంది. ముగ్గురు బిడ్డలూ బంగారపు బొమ్మలు. పాలతో కడిగిన  ముత్యాలులా వుంటారు. మొదటి కాన్పు ఆడపిల్ల. రెండు, మూడు కాన్పులు మగపిల్లలు. ఆ పిల్లల  అందానికి  ఎంతోమందో వాళ్ళను ఎత్తుకొని వదలరు. పెద్దమ్మాయికి