పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఓ పెద్ద సమస్య వుంది. రెండు మూడుసారులు కామవాంఛ కలిగింది. అది చంపుకున్నాను.

   హేమ త్యాగతి  భుజంమీద  చేయివేసి,  బావా!  అంది . త్యాగతి  హేమా ! ఆ మాటలు  చెబుతూ నా భుజం  మీద చేయ వేయకు !  అని  అంటూ చిరునవ్వు నవ్వాడు.
   త్యాగతి  ఆ ముక్క  అన్నాడు. అతనిలోని  నరాలు ఏదో వివశత్వం పొందినాయి. ఇంతలో ఏదో ఉప్పొంగు ఒక్కమాటుగ అతనిలోని తపను, కాంక్ష, ప్రేమ, పూజ కలసి మహాతరంగంలా  ఆకాశం అంటాయి. ఆ ముక్క హేమ అనడంలో అర్ధం ఏమిటి? కాని తన బావను  మళ్ళీ ఆలోచింపనిస్తేనా హేమ?
   హేమ : బావా! ఏమిటి ఆలోచన?                                                                                                                           
           
               

త్యాగతి : హేమా, మనకు తెలిసో తెలియకుండానో, మాటలంటాము. మాటలు మాటలతో పోవు. జీవితంలోంచి వచ్చిన మాటలు జీవితంతో గాఢసంబంధం కలిగి వుంటాయి. నువ్వు చటుక్కున నువ్వు ఆడపిల్లవైతే నిన్ను ముద్దుపెట్టుకు వుందును అన్నావు. ఆ మాటలు నువ్వు ఎంత అనాలోచితంగానో అన్నావు. అలాంటి మాటలు అనడంలో నీ వెనుక వున్న ఇరవై ఏళ్ళ జీవితమూ ఉంది. నీ తల్లిదండ్రులు నిన్ను అల్లారుముద్దుగా పెంచారు. వాళ్ళు ఒక దెబ్బతిని ఉండడంచేత నీ ఇష్టమే నీ ఇంట్లో రాజ్యం అయింది. నీ మాట శాసనం అయింది. నీ భావాలు అనేక ప్రళయాలకు, గాలివానలకు లోనవుతున్నాయి. కాని ఈ గాలివానల్లోంఛి నిదానం, ఉత్తమమార్గ పరిశోదనా రావాలని నువ్వు ప్రయత్నిస్తే నాకు సంతోషమే! నువ్వు బోల్షివిజము అని ఓ మాటలంటావు. గాంధీమహాత్ముని దారి అని ఓ మాటంటావు. నీలో ఈ రెండూ లేవు. మహాత్ముని దరంటే, బోల్షివిజానికి, ఆధ్యాత్మికతత్వం రంగారిస్తే అయిన మహోత్కృష్టభావం కాని అది నీలో ఎక్కడుంది? నీలో వట్టి నాశనతత్వం ప్రస్తుతం విజ్రుమ్బించివుంది. మీబోటి వాళ్ళే కొందరు ఎక్కువ ధనవంతులై ఫ్రాన్సులో ఇది ప్రారంభించారు. ఈ తత్వం అమెరికా కోటీశ్వరులది. మేం గొప్పవాళ్ళం. మేందేవతలం అనే భావమే వరసా వావీ లేని స్త్రీ పురుషుల కలయికలుగా మారింది. అదే మీ మతానికి పరమావధి. కాబట్టి, మనుష్యులలో కొందరు మాత్రం గొప్పవారు, తక్కినవారు నీచులు, అన్నతత్వం ఈ మతం అంత నిండి నిబిడీకృతం అయివుంది. మీ మతం హిందూదేశం అంతా అల్లుకుని చదువుకున్న వాళ్ళలో పాకింది. తెలుగువాళ్ళలో కొందరు గురువులున్నారు. అందులో మీ తీర్థమిత్రుడొకడు. అతనంత భయంకర రాక్షషుడు ఇంకోడు లేడు....

   హేమ కళ్ళేర్రజేసి, మొగం కందిపోగా , వణుకుతూ శక్తిలాలేచింది. ఛీ నోర్మూయ్! ఈవాగుడంతా వాగమని ఎవరధికారం ఇచ్చారు?  నీజీవితం  అంత ఛండాలపు జీవితం కాదు, మా  తీర్థమిత్రునిది! నీకన్న ఎన్నో