పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేదాంతం పూజారి వర్గంవారయిన బ్రాహ్మణులది. అందుకనే వేదాలలో, ధర్మశాస్త్రాలలో అందరూ బ్రహ్మపుత్రులనీ, తాము పెద్దన్నయ్యలై పుట్టారనీ చెప్పారు.

   త్యాగతి : ఆ  తర్వాతనో దేవీ!
   హేమ : ఫస్టుగా అన్నావు! నువ్వూ నేనూ  కలసి  ఓ  నాటకం ఆడాలి. సరే విను. అక్కడినుంచి ఆ బ్రాహ్మణరాజ్యం  ఉపనిషత్తు మెత్త వేదాంతానికి దిగితే. శ్రీకృష్ణుడు  వచ్చి  రాజుల  వేదాంతం భగవద్గీతలో చెప్పాడు. అది బలం చేశాడు తర్వాత  వచ్చిన  బుద్ధుడు. ఆ  తర్వాత  గాంధీ వచ్చి  కోమటి వేదాంతం  ఇచ్చాడు. ఇప్పుడు  సర్వసమానవత్వమైన శూద్రరాజ్యం వచ్చింది.
   త్యాగతి : దాని కెవరు వేదాంత గురువు?
   హేమ : ఎం. ఎన్. రాయి!
   త్యాగతి : అతడా! అతడు  పూర్వాశ్రమంలో  బ్రాహ్మణుడు ! అతని నిజమైన  పేరు  నరేంద్రభట్టాచార్యుడు. బెంగాలు పంచుకులీనోపాద్యాయులలో భట్టోపాధ్యాయుల వంశంవాడు.  ఈ  ఆశ్రమంలో  పేరు మారి  శూద్ర  పేరైన  మణీంద్రనాధరాయి అయింది.
   హేమ : నీ  వెటకారాలు మానెయ్యి.  అతడు స్వచ్చమైన శూద్రుడని తీర్థమిత్రుడన్నాడు. తీర్థ్ చాలా చదువుకొన్నాడు. మేఘు రాయి  మానస పుత్రీపుత్రకులం కాము. మీరు  మాత్రం వట్టి  గాంధీ బానిసలు.
   త్యాగతి : అయితే మీ వేదాంతం ఏమిటి? మీరే పక్షీయులు?
   హేమ : మా పార్టీ  మా స్వంత పార్టే!  ముందు ముందు  మా పక్షానికి  ఎక్కువబలం వస్తుంది  మా పక్షం పేరు  స్వచ్ఛ స్వేచ్ఛాపక్షం మాది స్వచ్ఛ స్వేచ్ఛావాదం! మాకు  జాతులు లేవు , మతాలూ లేవు, దేవుళ్ళులేరు, నీతి అనేది మానవుని ఇస్టంమీద ఆధారపడి ఉంది. సంఘానికి వ్యక్తి ధర్మం  నిర్ణయించే అధికారం లేదు. సాంఘీక ధర్మసూత్రం  నిర్ణయించే అధికారం వుంది.
   త్యాగతి :  అదే అనుకున్నాను. నీ వేదన అంతా  అర్ధమయింది నాకిప్పుడు. నీ నాటకమూ అర్ధమయింది. నీకూ స్వేచ్ఛా ప్రణయవాదం నచ్చింది. వాదనకు  ప్రియనాయకుడు ఒక్క తీర్ధమిత్రుడే అనుకున్నా! 
   హేమ : కాదు బావా, నువ్వు  ముసలమ్మలా వాదించక, నిజమైన భావం__విను  మరీ, ఆ బొమ్మమాని , మా నిజమైన భావం ఏమిటంటే-ఈ ప్రగతి స్థితిలో  వివాహం అడ్డు  వస్తుందని.
   త్యాగతి : ఇంకా!
   హేమ : ఇంకా లేదు గింకాలేదు! అన్ని పనులు మహోత్తమంగా చేయగలవారు సంఘం మీది, ఆస్తిమీది, రాజ్యం మీది, ప్రపంచం మీది, అనేగా ఆలోచన!  నేను నా విషయం బాగా  నిశ్చయించుకోలేదు. నాకు  వివాహం ఆడాలని లేదు. అమ్మా, నాన్నా, బాధపడతారని ఊరుకున్నా! నాకు  వివాహమూ, కామవాంఛా భరింపలేనివి కాలేదు. అయితే, ఏమి చేయాలని