పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమ : బాగుంది బావా. కానీ, కానీ. మా బావ నా వుద్దేశం వాడే అని నేను తీర్థమిత్రునితో అన్నాను. కాదని వాదించాడు. అతనివెఱ్ఱి అతనిది. నువ్వు పూంజీ భావం కలవాడవట. నీ వేదాంతం పూంజీవేదాంతంఅట.


త్యాగతి : రాయిష్టు! ఆ కథంతా నాకు తెలుసులే ! రాయిస్టుల సంస్కృతీ , వాదనా, వేదాంత వాదనా నాకు పూర్తిగా తెలుసు.

   హేమ : అదిగో, నీకూ  కల్పమూర్తికీ తీర్థమిత్రుడంటే అంత వుడుకుబోతు తనమేమి? అంత కోపమేమి?
   త్యాగతి: నాకు ఆరెండూ లేవు. అతని భావాలన్నీ  సంపూర్ణంగా నిరసిస్తా. అంతే. విను__ఏ రష్యాలోనో  ఒక ఇంగ్లీషువాణ్ణిగాని, ఒక అమెరికావాణ్ణి కాని అన్యాయంచేస్తే, ప్రాణద్రోహంగాని, రాజద్రోహంగాని చేస్తే వాళ్ళని గురించి  ఇంగ్లండు  అమెరికాలో ధనేశులూ, వేదాంతులూ ధనేశుల కవులూ నానా  అల్లరిచేసి వారి రాయబారులద్వారా  జాగ్రత్త అనే విషయం ఆ రష్యా  వగైరాది  రాజ్యాలకు తెలియజేస్తారు. అవతల  తామే  ఓ  డయ్యర్ దోమలను నలిపినట్లు వేలకొలది  బిడ్డలకూ, స్త్రీలనూ, పురుషుల్నీ, వృద్దుల్నీ కాల్చి కాల్చి, చంపి చంపి, జలియన్ వాలాబాగ్ లో గుండ్లు అయిపోవడం వల్ల ఊరుకుంటే మాట్లాడరు. జావాలో, బర్మాలో, ఆఫ్రికాలో, అమెరికాలో నీగ్రో మొదలైన ప్రజల్ని గొంగళి  పురుగుల కన్నా నీచంగా చూస్తారు. ఇది ధనేశ సామ్రాజ్యతత్వ వేదాంతము.  
   హేమ : చాలోయి బావా! నిన్ను ఆపళంగా ఆడపిల్లవైతే ఒక ముద్దు  పెట్టుకొని వుందును.
   త్యాగతి : నీ పుణ్యమా  అని  అలాంటి పొరపాటు పనులు మాత్రం చేయక.
       
                                                                                                            23
   మరదలు  హేమ  ఆ మాట  అనగానే  త్యాగతి ఏదో ప్రతివచనం అన్నా , అతని జీవితం  మూలమూలలా కదిలిపోయింది. తన గురుదేవుడు  తన కీ అగ్నిపరీక్ష యెందుకు పెట్టినాడు? తాను గృహస్తాశ్రమమే స్వీకరించవలసి వుంటే, తన  గురుదేవుడే ఇంతకన్న ఒక పల్లెటూరి కుటుంబపు అమ్మాయిని తనకు నియమిస్తే , తాను పెళ్ళాడి వుందేవాడే! హేమ ఒక పెద్ద సంస్థ! ఈమె తనవలనగానీ,  హేమ వలన   తానుగానీ  ఆనందం పొందగలగడం సంభవమా? ఎలాగు ఈ క్లిష్ట సమస్య విడిపోయేది? కాని  తాను హేమను ప్రేమిస్తున్నాడే. హేమా, శకుంతలా  ఒకటే మహాభావం యొక్క  స్త్రీ  అవతారాలన్న  విషయం తనకు  మెరుములా తోచినప్పుడు తాను పొంగి, పులకించి, సర్వభువనవ్యాప్తి నందినట్లు, దివ్యత్వమందినట్లు అనంద పరిపూర్తి దర్శించినట్లు తనకు  అనుభూతి కలిగిందే!
   హేమ : బావా! ఓ  బావా! కానియ్యవయ్యా నీ  ఉపన్యాసం! మనవాళ్ళ వేదాంతానికి,  మన భారతీయ జీవితానికీ ఏమీ సంబంధంలేదు వేదకాల