పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్యాగతి : బీదతనం లేకుండా చేయడమా, వారి నిత్య సత్యభావం?

   హేమ : కాదు . అందరికీ పని, అందరికీ తిండి,  అందరికీ బట్ట, అందరికీ ఇళ్ళు! ఒకరికి హెచ్చూ, ఒకరికి తగ్గూ ఉండ కూడదు. ప్రపంచంలో ధనం మనుష్యులందరిదీ!
   త్యాగతి : జంతువులది కాదా ?  జంతువుల్ని తినాలీ! జంతువుల్ని సరదాకు నాశనం చేయాలీ? మనుష్యుడు మానసికంగా ఎక్కువ బలవంతుడు, అందుకని  జంతువులు, క్రిమికీటకాదులు  వారి చెప్పుచేతల్లో వుండాలీ? మనుష్యులలో ఎక్కువ  బలవంతుల జట్టు తయ్యారైతే,  తక్కినవాళ్ళు వాళ్ళ చెప్పుచేతల్లో వుండాలీ?  అక్కడ ధర్మం వేరేం! అది తాత్కాలిక ధర్మమా? అది సరియైన సామ్యవాదమా? అవసరమైతే , ఎవరు సామ్యవాదానికి భయంకర శత్రువులో  వారితో  సంధి చేసుకోవాలీ, ఆ పూంజీ, ఫాసిస్టువాడు తనలాంటి ఇతర  సామ్యవాద విరోధుల నందరినీ నాశనం చేసి, తన అప్రతిమాన  అవిచ్ఛిన్న పూంజీతత్వం క్రింద తక్కిన సామ్రాజ్య పూంజీ దారులను బానిసలను చెయ్యాలి! అది సామ్యవాద రాజనీతా! ప్రకృతి శాస్త్ర సత్యానికి మానవ మనస్తత్వ సత్యం అతీతమా! ఆధ్యాత్మకం ఈ  ధర్మాన్ని నడపలేదా? ఒక సత్యమూ, ఇంకో సత్యమూ సామ్యవాద సత్యకోటిలో దెబ్బలాడుకోవచ్చా ? అని  తాత్కాలిక సామ్యవాద ధర్మాలా?
   హేమ : ఇదంతా సామ్యవాద నిరసనా?
   త్యాగతి : సామ్యవాదమేమిటి ?  దేన్నీ నిరసించలేను. సామ్రాజ్యతత్వం  ధనేశతత్వంమీద ఆధారపడి వుండి, ధనేశ రాజ్యంలో కొన్ని రాజ్యాలు  బానిస రాజ్యాలను స్థాపించినవి. ధనేకుల ధనం తిని, వారి భోగంలో పాలుపంచుకొని,  వారి  తృప్తికి సామ్రాజ్యవాది అగు కవి గాయకాదులూ, వేదాంతులూ, వేదాంతమూ, కళాది సంస్కృతీ  వుద్వవింపచేస్తారు. 'నిషీ' అనే వేదాంతి  బంగారపు జుట్టు, నీలికళ్ళు, తెల్లటి 'బ్లాండు' జాతిదే! మానసిక ఆద్యాత్మిక భౌతిక  శక్తులన్నీ వారివేనని వాదించాడు. అల్లాగా హెర్బర్టు స్పెన్సరూ, దార్వినూ శక్తిగల  ప్రాణే బ్రతుకుతుందనే ప్రామాణ్య వచనం ఉద్భవింపచేశారు. కిప్లింగ్ కవి పడమట  పడమటే, తూరుపు తూరుపే! ఈ రెండూ ఎప్పుడూ కలవవు అని  కవిత్వం వ్రాశాడు. ఈ ధనేశ వేదాంతము తెల్లజాతి  సామ్రాజ్యవేదాంతమయింది. మన భారతదేశంలో  ధనేశ వేదాంత  మంతలేకపోయినా కొద్దిగా వుంది.
   హేమ : అమ్మయ్యా కొంతైనా ఒప్పుకున్నాడు.
   త్యాగతి : ఉండు తొందరపడకు!  ఆ ధనేశ వేదాంతము  పూర్వకర్మ సముపార్జితం విత్తం భోగం అన్న మెత్త వేదాంతాన్ని పుట్టించింది. యజ్ఞయాగాది కర్మలలో  రాజసూయం, అశ్వమేధం  ప్రోత్సహింపజేసింది.  అన్నం కోసం దేవతలను  ప్రార్ధించాలనీ,  ఆ దేవతల కోసం యజ్జమనిన్నీ అన్న  భావం మాత్రం ధనేశ భావం కాదు సుమా!