పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమ : అల్లామాట్లాడాలి. గోముఖవ్యాఘ్రం బయలుపడింది. రంగు పూసుకుంటేమాత్రం చిరుతపులి చుక్కలు పోతాయా? వ్రతం చేసే పెద్దపులి మాంసభక్షణ మానుతుందా? ఏమి చూచావు నువ్వు రష్యాలో ? దేశాలన్నీ తిరిగి ఏమిటి నువ్వు కనిపెట్టింది?

   త్యాగతి : రష్యాలో నేను చూచిందా? స్త్రీలకు సమాన ఓటు ఉంది. స్త్రీలకు ఉద్యోగాలన్నింటిలోనూ సమనాదికారం ఉంది. బిడ్డలను పెంచే దాడి భవనాలు ఉన్నాయి. ప్రభుత్వోద్యోగాల్లో అడవాళ్ళెంతమందో ఉన్నారు. అన్ని వృత్తులలోను ఉన్నారు. వివాహం స్త్రీ రద్దు చేసుకోవచ్చు. పురుషుడు రద్దు చేసుకోవచ్చు. విచాహం రద్దు విషయంలో  ఎవరి తప్పైతే , వారి మీద పిల్లల పెంపకం బాధ్యత ఎక్కువ పడుతుంది.  
   హేమ : ఆ రకంగా  ప్రతి దేశంలోనూ వుంటే ఏం తప్పు వచ్చింది?
   త్యాగతి: ఈ విషయంలో రెండు దృశ్యాలను గూర్చి నీకు వర్ణించి  చెబుతాను. తర్వాత నీ అభిప్రాయం చెప్పు.
                                                                                                               22
   హేమ బావగారి దగ్గరగా జరిగి, అతను విన్యసిస్తున్న బొమ్మను పరిశీలనగా చూస్తూ,  ఎప్పుడూ  ఆడవాళ్ళ బొమ్మలే నువ్వు వేసేది అన్నది.  తమ కామవాంఛ తెలుపుకోవడానికి ,  తమ స్త్రీ వాంఛ తీర్చుకోవడానికి; వ్యంగ్యంగా స్త్రీల మీద  కవిత్వం; స్త్రీలను ద్రోహులుగా రచించడం, స్త్రీలను చిత్రించడం; స్త్రీలను గూర్చి కధలు వ్రాయడం; సినిమాతారల  బొమ్మలు గది నిండా వుంచుకోవడం; స్త్రీలకు___చిలకలకొలికి, లలిత, సుందరి, నతనాభి, ఆకాశమధ్య, చకోరస్తని, చపలాక్షి, కురంగాక్షి, రంభోరు, ఘనజఘనకుందరదన, హంసయాన, బింబాధరి, పల్లవపాణి__ఈ రకం  పేర్లు పెట్టి దేహం అంతా కబళింపు చూపులతో చూస్తూ, గ్రంథాలన్నిటినీ నింపడం; ఈ రకం జావకడివనులు చేస్తున్నారు కవులూ, శిల్పులూ, వగైరా వారంతానూ అని హేళనగా నవ్వింది.
   త్యాగతి : హేమా, నీ భావాలేమిటో స్పష్టంగా చెప్పు!
   హేమ : నా భావాలా? నావి రష్యాభావాలు. నాకు  ఈ పూంజీదారుల సంస్కృతీ , విజ్ఞానమూ ఇంతటితో అంతరించి, ఇక్కడనుంచైనా  నిజమైన సర్వప్రజారాజ్యం రావాలి. సర్వప్రజాసంస్కృతీ కావాలి అని గాఢవాంఛ బయలుదేరింది.                                                                                                                             
           
               

త్యాగతి : కోటీశ్వరులు తమ ఇళ్ళనిండా కళావస్తువులు పరచుకోవడం; తమ కోసం కవిత్వం వ్రాయించుకోవటం; తమ దానధర్మాలు మెప్పించుకోవడం; శాసనాలు చెక్కించుకోడం; డబ్బిచ్చి కృతులు పుచ్చుకోడం, సుబ్బిశెట్టులు షష్టిపూర్తి ఉత్సవాలు చేసుకోవడం; రఘురామచౌదరి, కూతురు పెళ్ళికిలక్షరూపాయలు ఖర్చుచేసి ఏభైవేలు కట్నమూరి ఏభై ఎకరాలు పెళ్ళికూతురికి వధూకట్నం, లాంచనాలకు వెండి బంగారు వస్తువులకు