పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమ : ఆడది వీధిముఖం చూడకూడదు. వీధిలోకి వస్తే ఆడది విచ్చలవిడిగా తిరిగేది! సినిమాకు వెళ్ళే ఆడది అయితే బరిమీద పడిందంటారు. ఒక్కర్తీ రైళ్ళలో ప్రయాణం చేయకూడదు! ఒకవేళ వెళ్ళినా , ఆడవాళ్ళ పెట్టెలో ప్రయాణం చేయాలి. అన్ని సౌకర్యాలూ మగవాళ్ళకా? మొదటి తరగతులూ, సభలకు వెళ్ళడం, వాహ్యాళులకు వెళ్ళడం, ఆటలపోటీ పందేలలో పాల్గోనడమూ! మొగుడనే రాక్షసుడే ఉంటే ఆటకట్టా?

   త్యాగతి : ఏమి చెయ్యమంటావు?
   హేమ : ఏమేమి చెయ్యాలో మీరు చెప్పరు. మీకు ఆడవాళ్ళ గొడవే అక్కర్లేదు. పెళ్లాలయితే కావాలేం!
   త్యాగతి : మేము ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెప్పినా పురుషులుగానే ఆలోచించి చెప్తాము కాదా!
   హేమ : ఓహో ! ఏం గర్వమూ? ఏమి అహంభావమూ? అయితే,మీరు హరిజనులుకారు, హరిజనోద్యమంమీద మీ అభిప్రాయం యెందుకిస్తారు?  ఎందుకయ్యా ఈ డాబులు మాట్లాడతావు?
   త్యాగతి : హేమా !  నీకు కోపం వస్తే చెప్పలేను. కుర్రవాళ్ళు చదువుకొనే రోజుల్లో , వాళ్లకు వాళ్ళ ఇష్టం వచ్చిన స్వేఛ్చ వుందనా? వివాహ విషయంలో  వాడిమాట సాగుతుందనా?  వాడి ఉద్యోగం విషయమై  కూడా వాడికి స్వేఛ్చ వుందనా?
   హేమ : లేదయ్యా! అట్లాగే ఒప్పుకుందాము. కాని  వాడికి మొదటి నుండీ  వుండే  స్వేఛ్చ  ఆడవాళ్ళకి ఇవ్వద్దంటావా?
   హేమ : నీ వాదనలన్నీ చక్కగానే వున్నాయి. ప్రాపంచికంగా ఆలోచిస్తే ,  నా  స్వాతంత్ర్యం  నువ్వు  తీసుకోవాలంటే  నేను నీకన్న బలహీనుణ్ణి కావాలికదా! ప్రకృతి విషయం ఆలోచిద్దాం. ప్రస్తుతం ఆడవాళ్ళు బలహీనులు. అన్ని దేశాల్లో ఉండే పురుషులుధర్మమో, న్యాయమో , మంచో, చెడ్దో ఆలోచించి స్త్రీలకు వారు కోరినవన్నీ ఇవ్వాలి. స్త్రీలు పురుషులు ఇష్టపడకపోతే ఒక్క స్వేఛ్చ తీసుకోలేరు. స్త్రీలకు దేహబలం తక్కువ, ఆవేశబలం ఎక్కువ. ఏ విషయంలోనైనా  స్త్రీలు పురుషులకు లొజ్జు. వంట చేయడంలోనూ గొప్ప వంటవారు పురుషులే! సంగీతంలో ఆడవాళ్ళ గొంతు బాగుండవచ్చు గాని, పాండిత్యం గంభీరతా మగవాళ్ళదే. శాస్త్రజ్ఞానంలో  ఎవ్వరో ఒక్క మదాంక్యూరీ తప్ప పుట్టింది. కవిత్వంలో మొల్లలూ, సాఫోలూ, పెరల్ బుక్కులు, తిక్కన్న , తియాక్రటీస్, ఆప్టన్ సిం క్లెయర్లు ముందు దివ్విటీముందు దీపాలు. రాజ్యాలు పాలించిన చక్రవర్తినులలో  ఒక్కరుద్రాంబ తప్పితే, తక్కీనవాళ్ళ చరిత్ర జుగుప్సా కరము. అలాంటప్పుడు స్త్రీలుకోరేస్వేఛ్చ ఎందులో? ఇష్టం వచ్చిన  పురుషునితో  అవినీతిగా సంచరించడంలోనా? డబ్బుతగులబెట్టి మూడుకాయలూ, ఆరుపళ్ళుగా జీవితం పాడుచేసుకోవాలనా? ఏమిటీ ఆడవాళ్ళకు కావలసింది?