పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శిల్పకర్మాగారము. ఈ కర్మాగారము రెండు భాగాలుగా విబజింపబడి ఉంది. ఇవతల శిలాశిల్ప కర్మాగారము, అవతల లోహశిల్ప కర్మాగారము.


   ఈ రెండు భవనాలూ నిర్మించడానికి శ్రీనాథమూర్తికి ముప్పది ఎనిమిది వేల రూపాయలైనవట! తాను నివసించేమేడ ఎనిమిది వేలకు కొన్నాడు. శిల్పభవనాల స్థలం  నాలుగువేల రూపాయలైనదట. తల్లి కూడదీసిన రూపాయలూ, తన ఆస్తిగా వుంచుకొన్న భూమి అమ్మగా వచ్చిన రూపాయలూ, తాను రచించిన శిల్పచిత్రలేఖనాలు అమ్మగా వచ్చిన రూపాయలూ, అన్నీ ఖర్చు పెట్టినాడు. త్యాగతి ఇప్పుడు దైనందినపు  ఖర్చు తల్లిగారికీ, అక్కగార్లకూ తానిచ్చిన ఆస్తులు ఆదాయముతోనూ, బొమ్మల వల్ల వచ్చిన  ఆదాయమువల్లనూ!
   హేమసుందరీ, లోకేస్వరీ కారుదిగి శ్రీనాథమూర్తి శిల్పమందిరంలో పనిచేసుకుంటూ వుండగా  వెళ్ళినారు. లోకేశ్వరి కొంచెంసేపుండి వెళ్ళిపోయింది.
   త్యాగతి : హేమా! ఏదైనా బొమ్మపై పనిచేస్తావా?
   హేమ: చేస్తానుబావా! కాని ఉగాదినాటి మా సంగీతనాట్యం ఎల్లా ఉందో విమర్శనాపూర్వకంగా నీ అభిప్రాయం చెప్పావు కావేమీ?
   త్యాగతి: ఈ రెండు మూడు రోజులనుంచీ చెబుతున్నానుగా హేమా!
   హేమ : ఆ చెప్పావులెద్దూ!  బాగుంది! అద్భుతంగా వుంది! చాలా చక్కగా వుంది అనేగా నువ్వు చెప్పింది. 

ఇలాంటి అభిప్రాయాలు ప్రతి వెంకమ్మా, వెంకయ్యా ఇవ్వనే ఇచ్చారు. దీనికన్న మా తీర్థుడు నయం, ఆఖరికి మా కల్పమూర్తి నయం.

   త్యాగతి మౌనంగా ' విప్లవస్త్రీ ' అనే బొమ్మ రచిస్తున్నాడు. తలెత్తకుండా బొమ్మను  విన్యసిస్తూనే,  వాళ్ళిద్దరూ ఏమన్నారేమిటి?
   హేమ : వాళ్ళ అభిప్రాయాలు నీకెందుకు? నీ అభిప్రాయం చెబుదూ!
   త్యాగతి : ఒకమ్మాయిగారు తాను నిర్వహించిన  మహాకళాకార్యాన్ని అందరూ మెచ్చుకోవాలని ఆవేదనపడిపోతోందట.
   హేమ : అందరూ మెచ్చుకొంటే ఎవరిక్కావాలి, మెచ్చుకోకపోతే ఎవరిక్కావాలి?
   త్యాగతి : ఇంక ఏంకావాలి?
   హేమ : పోదూ అంతా బడాయే! నీ అభిప్రాయం అడుగుతున్నాను గదా  అని గర్వం  నీకు మరీని!        
                                                                                                                21
   త్యాగతి తలెత్తి తీక్షణంగా  హేమవైపు చూశాడు.  హేమా! నువ్వు నాట్యం నిన్న మొన్న ప్రారంభించినా , ఎంతో ఎంతో నేర్చుకొన్నదానిలా నాట్యం చేశావు. నాట్యంలో , అభినయంలో ఏవైన లోట్లు అప్పుడప్పుడూ వచ్చినా , అవి నా కళ్ళలాంటి దుర్భిణీయంత్రం కళ్ళవాళ్లకి తెలుస్తాయేమో! నీ చక్కదనమూ నీ సంగీతజ్ఞానమూ నాటకానికి ఎంతో అందం తీసుకువచ్చాయి.!