పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ చైతన్యమందిరం పొడుగు ముప్పది అరడుగులు. వెడల్పు పదునెనిమిది అడుగులు. పైన అర్థచంద్రాకృతిగా వుండే వితానమంతా కాంక్రీటుతో తయారు చేసినదే. చైతన్యమందిరానికి సింహద్వారం కాకుండా మూడువైపులా గోడలకు మధ్యగా మూడుద్వారాలున్నాయి. ఆ ద్వారాలకు మూడు టిబెట్టు తెరలున్నాయి. ఒకదానిపై అమితాభ బుద్ధమూర్తి చిత్రించివుంది. అమితాభుడూ, అమితాభుని సేవింపవచ్చిన బుద్దులూ, అర్హతలూ, బొదిసత్వులూ, పద్మాలలో ఆ దివ్యపథంలో కాంతి మేఘాలమధ్య గోచరమౌతున్నది. ఈ తెర ఎడమ చేతివైపు గుమ్మానికి వుంది. కుడిచేతివైపు, అంటే బుద్ధావిగ్రహానికి ఎడమవైపు గోడకున్న గుమ్మానికి వున్న తెరపై సిద్దార్థచిత్ర మున్నది. బుద్ధదేవుని వెనుక అలంకారరూపమైన బోధివృక్షము వున్నది. క్రింద కామదేవుడు, అతని కుమార్తెలు రాక్షసులు, పిశాచాదులు వున్నారు, పైన దేవులున్నారు. పద్మాలు, పద్మలతలూ, మేఘాలు అలంకార స్వరూపంగా వున్నాయి. విగ్రహం వెనుక వున్న గుమ్మంతెర శ్వేతతారాదేవి విగ్రహముతో వున్నది. ఆ చిత్రం వర్ణనాతీత మనోహరంగా వున్నది. పద్మాలూ, లతలూ, దేవిని కొలిచే పరివారదేవీ స్వరూపాలూ ఆ తెరపై చిత్రింపబడి వున్నాయి.


ఈ చైతన్యమందిరంలో కుడివైపు గుమ్మంలోంచి వెడితే, కళాగ్రంథాలయంలోనికి వెడతాము. ఎన్నో భూర్జపత్రగ్రంథాలూ, జపాను, చీనా గ్రంధాలూ, పాశ్చాత్య భాషలలో గ్రంథాలూ, తాళపత్రగ్రంధాలూ, దేవనాగరిలిపిలో, తెలుగు లిపిలో గ్రంథాలూ, శిల్ప చిత్రలేఖన నాట్య సంగీతాలను గూర్చి వున్నాయి. ఈ గదికి ప్రక్క చైతన్యమందిరాన్ని అంటి ఇంకొలున్నాయి. ఒకటి త్యాగతి శిల్పమందిరము, రెండోది చిత్రమందిరము. ఇటు చదువుకొనే గదివెనక, అందులో సగంవైశాల్యం గదిలో త్యాగతి శిల్పచిత్ర సామాగ్రి ఉంచుకొనే గది. అవతలవైపు అంతే కొలత వున్న గది విద్యార్ధులు నేర్చుకొనేందుకు వున్నది. ఈ చిన్నమేడ యాభైనాలుగడుగుల సమచతురస్రం. వెనుకప్రక్క ఈ యాభైనాలుగడుగుల పొడుగునా వసారా వుంది. ముందుభాగంలో విహారరూపంలో ఉన్న మందిరాలు రెండూ ఈవలావల, మధ్య చైత్యానికి వసారా లేకుండా ముందుకు చొచ్చుకువచ్చిన వితానాలున్నాయి. తలుపులు, వాతాయనాలు అన్నీ అజంతా విధానంలో ఉన్నాయి. శిల్పచిత్రమందిరాలన్నింటిలోనూ, గ్రంథపఠనమందిరంలోనూ ప్రాచీన రాజపుత్ర, మొగలు చిత్రలేఖనాలు, ఈనాటి వివిధ దేశ చిత్రలేఖనాలువున్నవి.

   ఈ శిల్పభవనం వెనుక  చక్కని భవనం  ఒకటి ఉన్నది. అది యాభైనాలుగు అడుగుల పొడవు,     ముప్పది అడుగుల వెడల్పూ ఉంటుంది. రెండు పొడుగాటి  హాలులుగా అది  భాగింపబడి ఉంది. ఒకటి శిల్పచిత్ర ప్రదర్శనశాల, రెండవది