పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వము లేకే

                                                   నవ్యమెచ్చటే?
                                                   మూడుకాలములు
                                                   ముడిగొన్న క్షణం
                                                   నిత్యనూతనం
                                                   సత్యం నేనే
                                                   వయసు వార్ధకం
                                                   ఆశ నిరాశా
                                                   నామాంతరములు
                                                   నాకె శుభాంగీ
                                                   నేనె వసంత
                                                   నేనె అనంతం
                                                  నేను లేనిదే, నేను రానిదే
                                                  నిత్యమృత్వువై నీవు నిలుతువే!
                                                  పురుషుడు లేని  పొలతి ఎందుకే
                                                  నారికి నరుడు, నరునకు నారీ!
                                వనదేవి:      రావోయి ఆమనీ, రావోయి నా ప్రియుడ
                                                  ననుజేరి జగతికే నవ్యసృష్టీయరా!
                                 కోకిల:        కో! కో! కోకోకో కోకోకో కోకోకో ! కోకోకో!
                                                  ఆకు రాలినవెంట అమరు ఎఱ్ఱని చిగురు
                                                  అణగిపోయిన వశ్చరమువెంట వృషవచ్చె కో! కో! కో!
                             పూవులు:      మా నాథులు భ్రుంగాలూ
                                                 మాకై పాడుతువచ్చారూ
                              వనదేవి :       పోయినది చీకటీ
                              వసంతుడు :  పోయినవి గోలుసుల్లు
                                                 ధర్మస్వాతంత్ర్యమ్ము
                                                 దశ దిశలు వెలిగించె.
   వాద్యమేళం తారాశ్రుతికి వాలి ఆగిపోయింది. సృష్టి స్వరూపమైన వీణాతానంమాత్రం వేగవంతమై వినిపిస్తుండగా, పూలజల్లులను  పుష్ప బాలలు వనదేవీ వసంతులమీద జల్లుతుండగా తెరలు  రంగస్థలాన్ని కప్పాయి. తెర ముందుకు మంగళహారతులతో బాలికలు వచ్చి సభ్యురాండ్రపై అక్షతలు చల్లారు.
   హేమకుసుమసుందరీదేవిని ఆంధ్ర మహిళాలోకం అంతా ప్రశంసించింది. సంవత్సరాది ఉత్సవాలకు కల్పమూర్తీ, తీర్థమిత్రుడూ, వినాయకరావుగారూ,