ఈ పుటను అచ్చుదిద్దలేదు
పొగరెక్కి విరహమని
పొగులుచున్నావూ?
మాధవి: ఎవరోయి పురుషుడా
ఎవరోయి నువ్వూ!
మారాణి మాటెత్తి
మతి లేని ఆటా?
మల్లిక : ప్రేమమాటల వరదు
ప్రియుడ వెవరోయీ?
కన్నుగానని మత్తు
గంతులా ఇచటా?
శేఫాలి : మా చెలిని వెదకుతూ
మసలబోకోయి
తెలిసె నీ పోకిళ్ళు
తొలగిపోవోయీ.
వనకన్య : నిలు నిలు మోయీ
కలుషిత హృదయా!
వలపు మాటలిక
పలుకకుమోయీ!
అన్నివాడలా
అగ్ని కమ్మినది
ప్రళయకాలమే
ప్రణయావసరమ?
నిలు నిలు మోయీ
కలుషిత హృదయా!
పూర్వ ఖర్మములు
బుగ్గయినా
కొత్త భావములు
ఎత్తే మొలకలూ
నిలు నిలు మోయీ
కలుషిత హృదయా!
19
వసంత: నేనె పూర్వమును
నేనె నవ్యమును