పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమె పాడవలసిన పాట శ్రీనాథమూర్తి పదిరోజులు కస్టపడి సాధ్యమైనంతవరకూ తెలుగునుడికారం పోకుండా ఆమెకు నేర్పాడు. పారిజాతపుష్పం నాట్యచేస్తూ,

                                                    సఖీ! వనదేవీ!
                                                    వచ్చితినమ్మా పారిభద్రమును, సఖీ, వనదేవీ!
                                                    స్వర్గమునుండీ తెచ్చితి  నే  నొక
                                                    సందేశం భవి వనితలకూ!
                                                    ధర్మం మరచిన స్వేఛ్చకోరుటే
                                                    తలపబోకుడీ భువికాంతల్!
                                                   ధర్మంపోతే, నీతులుపోతే,
                                                   తరుణుల మనసులు గతులు తప్పితే,
                                                   శృతిలోపించిన జగజ్జీవనం
                                                   గతిమాలినదే వెతలకు సాకు
                                 పూవులన్నీ : ఏమిటి నీతి
                                                     ఏమిటి జాతీ
                                                     జాతి నీతులే
                                                     సతులకు విషముల్
                                                     నీతి పేరునా పురుషులు విషమూ
                                                     జాతి పేరునా మతముల విషమూ
                                       వనదేవి :   మా నీతులు  మేం నిర్మిస్తామూ
                                                      మా ధర్మం  మేం నిలుపుకొందుమూ
                                                      పురుషుడు పలికే ధర్మమే విషమూ!
                                                      పురుషుడు వ్రాసిన నీతే విషమూ!
                                                     (ప్రవేశం లోకేశ్వరి  వసంతుని  వేషంలో)
                                   వసంతుడు : ఓ చెలీ! వనకన్యా!
                                                      ఓ దివ్యసుందరీ!
                                                      నీకొరకు  వెదకుతూ 
                                                      నీకొరకు విరహినై
                                                      నిలువెల్ల పులకిస్తు
                                                      కలలు కంటూ వస్తి
                                                      ఓ చెలీ! వనకన్యా!
                                       మాలతి : ఈ  వేస మిది  యేటి
                                                      ఎవరోయి నువ్వూ?