పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18

   వంగపండుచాయతో నిండిన ఆ రంగస్థలంలోనికి వనదేవి వేషాన నాట్యంచేస్తూ హేమ ప్రవేసించింది. ఆమె చీర వంగపండుఛాయ; రవిక ఆకుపచ్చ. ఆమె అలంకారాలన్నీ పూలమాలలూ , ఆకులూ, పూలబాలిక లందరూ ఒకప్రక్క నాట్యరూపంగా నిలిచి ఉండిరి.
                                                   వనదేవి : వనదేవినే నేను 
                                                   వినుడమ్మ సుమసుతులు
                                                   వనిత హక్కులు కోరు
                                                   దినము వచ్చే నేడు.
                                                   మగవాని ఆజ్ఞలో 
                                                   మసలితిమి ఇన్నాళ్ళు
                                                   మన ధర్మముల మరచి
                                                   మాయ ముంచెను నరుడు
                                                                         వన........
                                                  ఆర్యనారీ ధర్మ
                                                  మడుగంటచేసాడు
                                                  వేదకాలం మాట
                                                  చేదయ్యే అతనికి
                                                                      వన........
                                                 వెనక చూపులు మాని
                                                 వెళ్ళాలి ముందుకే
                                                 బెదురూ చూపులు మాని
                                                 కదలండి ముందుకే!
                                                                      వన........                                                                                                                           
           
               

ఆమె అభినయం వైదుష్యంలో కొంచెం లోటయినా, చాలా మనోహరంగా ఉంది. నాట్యము, నృత్యము, ప్రేక్షకులను రంజింపజేశాయి. ఆమె కంఠంలో ఎన్ని ఆకాశాల లోతులో , ఎన్ని ఉదయాల కాంక్షలో, ఎన్ని పూర్నిమల మాధుర్యాలో వున్నాయి. ఇంతట్లో సోఫీ పారిజాత కుసుమ వేషంలో వచ్చింది. ఆమె వేషం, ఇతరుల వేషాలు ఇలా వుండాలని త్యాగతే నిర్ణయించి , చిత్రం లిఖించి ఇచ్చాడు. సోఫీ మదరాసులో ఉన్న ముఖ్య ఆంగ్లకుటుంబ బాలికలతోబాటు ఒపెరా (గీతా నాటికలలో) నాయిక వేషం వేస్తూ ఉండేది. ఆ వేషాలలో గులాబీ కన్యవేషం ఒక నాటికలో వేసింది. ఆ వేషానికి కొన్ని మార్పులుచేసి శ్రీనాథమూర్తి పారిజాతకుసుమ వేషం వేశాడు సోఫీకి.